ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో ర్యాలీ

ABN, First Publish Date - 2020-09-24T07:07:45+05:30

నూతన రెవెన్యూ చట్టంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం కరీంనగర్‌లో భారీ ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ర్యాలీని నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 23: నూతన రెవెన్యూ చట్టంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం కరీంనగర్‌లో భారీ ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ర్యాలీని నిర్వహించారు. కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి దాదాపు 300 ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో తరలివచ్చిన రైతులు  రేకుర్తి సాలెహ్‌ ఈద్గా నుంచి కోర్టు, తెలంగాణ చౌక్‌, బస్టాండ్‌, కమాన్‌చౌరస్తా నుండి ఎన్టీఆర్‌ విగ్రహం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు నాయ కులు మాట్లాడుతూ తరతరాలుగా పేరుకు పోయిన భూసమస్యలకు ఇక పరి ష్కారం దొరికినట్లేనని సంతోషం వ్యక్తంచేశారు. రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిన సీఎం కేసీఆర్‌ వెంటే ఉంటామని, వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి మేలు చేశారని నినదించారు.


ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, కొత్తపల్లి, కరీంనగర్‌ ఎంపీపీలు పిల్లి శ్రీలత, తిప్పరి లక్ష్మయ్య, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు మంద రాయమల్లు, శ్యాంసుందర్‌రెడ్డి, బల్మూరి ఆనందరావు, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు, మల్కాపూర్‌ సర్పంచ్‌ కాసారపు శ్రీనివాస్‌, నాయకులు సుంకిశాల సంపత్‌రావు, పిట్టల రవీందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T07:07:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising