ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యాంపు కార్యాలయాలతో సమస్యల పరిష్కారం

ABN, First Publish Date - 2020-12-12T05:01:10+05:30

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు దోహదపడుతాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో రూ 1.30 కోట్లు ని ధులచే నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఈశ్వర్‌, కలెక్టర్‌ రవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి, డిసెంబరు 11: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు దోహదపడుతాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో రూ 1.30 కోట్లు ని ధులచే నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఈ కార్యాలయాల ద్వారా ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారానికి నోచుకుంటా యని అన్నారు. ఎమ్మెల్యే లకు స్వేచ్ఛాయుత వాతావారణంలో సీఎం కేసీ ఆర్‌ క్యాంపు కార్యాల యాలను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకు న్నట్లు వివరిం చారు. ఈ భవనం కోసం ఆర్‌అండ్‌బీ ద్వారా కోటి, పీఆర్‌ ద్వారా రూ 30 లక్షలు మంజూరు చేసి అన్ని వసతులతో నిర్మించినట్లు ఆయన తెలిపా రు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తు తనకు అందుతుందన్నారు. మొదటి రోజు క్యాంపు కార్యాలయం నుంచి 50 మంది లబ్దిదారులకు రూ 50,05,800 కల్యాణలక్ష్మి, 46 మంది లబ్దిదారులకు రూ 12,81,000 సీ ఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఆయన అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద పల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌నేత, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు సం జయ్‌కుమార్‌, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వ సంత, కలెక్టర్‌ రవి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, ధర్మపురి మున్సిప ల్‌ చైర్‌పర్సన్‌ సత్యమ్మ, ధర్మపురి ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీ టీసీ అరుణ, ఏఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు. 

నృసింహుని సన్నిధిలో

 కోరుట్ల ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్‌ పూజలు

ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని కోరుట్ల ఎమ్మెల్యే వి ద్యాసాగర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత వేర్వేరుగా శుక్రవారం సం దర్శించారు. వేదపండితులు, సిబ్బంది వారికి స్వాగతం పలికారు. అనం తరం స్వామి సన్నిధిలో వారు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ వే దపండితులు బొజ్జ రమేష్‌శర్మ మంత్రోచ్ఛరణల మధ్య వారిని ఘనంగా ఆశీర్వదించారు. ఈవో సంకటాల శ్రీనివాస్‌ వారికి స్వామి శేష వస్త్రం, ప్ర సాదాలు బహుకరించి సత్కరించారు. బుగ్గారం ఎస్‌ఐ చిరంజీవి, సీని యర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T05:01:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising