ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్పంచ్‌, కార్యదర్శిని తొలగించాలి

ABN, First Publish Date - 2020-12-04T04:28:17+05:30

గ్రామ పంచాయతీ కార్యాలయంలోని అవినీతి, అక్రమాలపై బాధ్యులైన గ్రామ సర్పంచ్‌ , కార్యదర్శిని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ఇటిక్యాల గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు.

కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 03: గ్రామ పంచాయతీ కార్యాలయంలోని అవినీతి, అక్రమాలపై బాధ్యులైన గ్రామ సర్పంచ్‌ , కార్యదర్శిని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ఇటిక్యాల గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఇటిక్యాల గ్రామంలో 2019లో ఎస్‌ఎఫ్‌సీ కింద విడుదలైన రూ.5,58,000లను చట్టవ్యతిరేకంగా గ్రామ సర్పంచ్‌ తన స్వంత అవసరాల కొరకు విత్‌డ్రా చేసి వాడుకున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయితీ కార్యవర్గ సమావేశం లేకుండానే , ఎలాంటి తీర్మానం చేయకుండానే తన స్వలాభం కొరకు రైతు వేదిక భవనాన్ని తనకు అనుకూలం ఉన్న చోట నిర్మాణం చేశారన్నారు. ఇటిక్యాల గ్రామంలో ప్రజా సమక్షంలో విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, సంబంధిత సర్పంచ్‌, కార్యదర్శిని విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు డీపీవో, కలెక్టరేట్‌ కార్యాలయాల్లో వినతిపత్రం అందించారు.

Updated Date - 2020-12-04T04:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising