ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలి

ABN, First Publish Date - 2020-12-16T05:03:19+05:30

సింగిల్‌విండో అభివృద్ధికి పాలక వర్గం రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు కోరారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని పెద్దూరు సింగిల్‌విండోను మంగళవారం సందర్శించారు.

వినతి పత్రం అందజేస్తున్న పాలక వర్గం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల రూరల్‌. డిసెంబరు 15 :  సింగిల్‌విండో అభివృద్ధికి పాలక వర్గం రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు కోరారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని పెద్దూరు సింగిల్‌విండోను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా  పాలక వర్గం అధ్వర్యంలో  ఘనంగా సన్మానించారు. అనంతరం  ఆయన మాట్లాడుతూ సింగిల్‌విండో పరిధిలోని రైతులందరికీ ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు.   సింగిల్‌ విండో నుంచి అందించిన రుణాలను సకాలంలో రికవరీ చేయాలన్నారు  కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేయాలంటూ పాలకవర్గం సభ్యులు వినతి పత్రం అందజేశారు. చైర్మన్‌ బర్కం వెంకట లక్ష్మీ, వైస్‌ చైర్మన్‌ బెజ్జారం నారాయణగౌడ్‌, డైరెక్టర్లు బడుగులక్ష్మీ, భూక్య కిషన్‌నాయక్‌, మంగ కిరణ్‌, మల్లబోయిన రాజేందర్‌, తాళ్లపల్లి భాస్కర్‌గౌడ్‌, పంచాగం ఎల్లయ్య, ఆదిపెల్లి శ్రీనివాస్‌గౌడ్‌, బర్కం నవీన్‌యాదవ్‌, సీఈవో చిలుక గౌరిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-16T05:03:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising