ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూగర్భ గనులను నడిపించాలి : టీబీజీకేఎస్‌

ABN, First Publish Date - 2020-05-14T09:53:21+05:30

సింగరేణి యాజమాన్యం లే ఆఫ్‌ను రద్దు చేసి భూగర్భ గనులను నడిపించాలని సంస్థ గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోదావరిఖని, మే 13: సింగరేణి యాజమాన్యం లే ఆఫ్‌ను రద్దు చేసి భూగర్భ గనులను నడిపించాలని సంస్థ గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ అధ్యక్ష,కార్యదర్శులు బీ వెంకట్రావ్‌, మిర్యాల రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో యాజమాన్యం భూగర్భ గనులకు లే ఆఫ్‌ ప్రకటించిందని, దీంతో సగం వేతనాలు పొందుతున్న కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటిస్తూ కరోనా చర్యలు చేపడుతూ భూగర్భ గనులను తిరిగి నడిపించాలని, మార్చి నెల 50శాతం వేతనాలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి యాజమాన్యానికి 48రోజులు మాత్రమే లే ఆఫ్‌ ప్రకటించే అధికారం ఉందని గుర్తు చేశారు. జాతీయ కార్మిక సంఘాలు ధ్వంద వైఖరి అవలంభిస్తూ తమ యూనియన్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, కార్మికులు జాతీయ కార్మిక సంఘాల మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.


గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని, కార్మికులు తమ పక్షాన ఉన్నార ని గుర్తు చేశారు. సమావేశంలో నాయకులు జాహెద్‌పాషా, పెద్దపల్లి సత్యనారాయణ, శ్యాంసన్‌, దామోదర్‌రావు, వెంకటేష్‌, ఏ కృష్ణమూర్తి, వీ శంకర్‌, నాయిని మల్లేష్‌, పుట్ట రమేష్‌, మండ రమేష్‌, రాంచందర్‌, శంకరయ్య తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-14T09:53:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising