ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనపై మున్సిపల్‌ కొరడా

ABN, First Publish Date - 2020-05-09T10:13:59+05:30

లాక్‌డౌన్‌ పొడిగించిన ప్రభుత్వం కొన్ని సడలిం పులతో వ్యాపార సంస్థలు, మద్యం దుకాణాలు తెరుచుకునే అవకాశాన్ని కల్పించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): లాక్‌డౌన్‌ పొడిగించిన ప్రభుత్వం కొన్ని సడలిం పులతో వ్యాపార సంస్థలు, మద్యం దుకాణాలు తెరుచుకునే అవకాశాన్ని కల్పించింది. ఒక రోజు 50 శాతం దుకాణాలు, మరో రోజు 50 శాతం దు కాణాలు తెరిచే విధంగా నిర్ణయించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దుకాణాలు తెరుచుకోవడంతో సందడి పెరిగింది. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిం చకుండానే జనం దుకాణాల వద్దకు వస్తున్నారు.  మాస్క్‌లు ధరించకపోవడం, రోడ్లపై ఉమ్మివేయ డం వంటి చర్యలకు పాల్పడుతుండడంతో సిరి సిల్ల మున్సిపల్‌ అధికారులు కొరడా ఝళిపించా రు.


శుక్రవారం సిరిసిల్లలో కమిషనర్‌ సమ్మయ్య తోపాటు అధికారులు జిల్లా కేంద్రంలోని మార్కెట్‌, పెద్దబజార్‌, చేనేతచౌక్‌, గోపాల్‌నగర్‌, గాంధీ చౌక్‌లో పర్యటించారు. గాంధీచౌక్‌ వద్ద వైన్స్‌ ఎదు ట భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్‌ ధరించకుండా వచ్చినవారికి మద్యం విక్రయిస్తుం డడం వంటివి కనిపించడంతో మద్యం దుకాణం నిర్వాహకులకు రూ.5 వేలు జరిమానా విధించా రు.  దుకాణాన్ని సీజ్‌ చేశారు. మాస్క్‌ లేకుండా వచ్చిన వ్యక్తికి రూ.వెయ్యి జరిమానా వేశారు. సరి, బేసి సంఖ్యలో దుకాణాలు కేటాయించాలని నిబం ధనలు ఉన్నా వాటిని పాటించకుండానే సిరిసిల్ల, వేములవాడలో దుకాణాలు తెరుచుకునే అవకా శం కల్పించడంతో భౌతిక దూరం పాటించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

Updated Date - 2020-05-09T10:13:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising