ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలస కార్మికుల ఆరోగ్య పరిస్థితి పరిశీలించిన డీఎంహెచ్‌వో

ABN, First Publish Date - 2020-05-28T11:07:41+05:30

రామడుగు మండల పరిధిలోని వలస కార్మికుల ఆరోగ్య పరిస్థితి పరిశీలించినట్లు జిల్లా, వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుభాష్‌నగర్‌, మే 27: రామడుగు మండల పరిధిలోని వలస కార్మికుల ఆరోగ్య  పరిస్థితి పరిశీలించినట్లు జిల్లా, వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుజాత తెలిపారు. బుధవారం మండలంలోని వెదిర గ్రామాన్ని ఆమె సందర్శించారు. ముంబాయి నుంచి వచ్చి  హోం క్వారంటైన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులను స్వయంగ పరిశీలించారు.  క్వారంటైన్‌ స్టాంప్‌ వేయబడిన వారు ఇంట్లోనే ఉండాలని ఎవరితో కలవకూడదని ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగరాదని సూచించినట్లు పేర్కోన్నారు. 


చొప్పదండిలో స్ర్కీనింగ్‌ పరీక్షలు

చొప్పదండి మండల కేంద్రంలో 5 వైద్యబృందాలు 265గృహాలను సందర్శించి 1,066మందిని ఇన్‌ఫ్రారెడ్‌ పరికరం ద్వారా స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్‌ సుజాత తెలిపారు. అలాగే కరీంనగర్‌లో ఇంటర్మీడియట్‌ స్పాట్‌ కేంద్రాలవద్ద 266మందికి స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. టెలీమెడిసిన్‌ ద్వారా 10మందికి వైద్య సలహాలు, సూచనలు ఆమె తెలిపారు.


పీహెచ్‌సీ తనిఖీ

రామడుగు: రామడుగు పీహెచ్‌సీని జిల్లా వైద్యఅరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుజాత బుధవారం తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యంను పరిశీ లించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం వెదిరలో హోం క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులను కలిసి సలహాలు అందించారు.

Updated Date - 2020-05-28T11:07:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising