ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంపు నిర్వాసితులపై ఉదారంగా వ్యవహరించాలి

ABN, First Publish Date - 2020-12-29T05:43:27+05:30

మిడ్‌ మానేరు నిర్వాసితులపై ఉదారంగా వ్యవహరించాలనీ, ప్రాజెక్ట్‌ నిర్మాణంలో వారి త్యాగం మరువలేనిదనీ, వారి సమస్యల పరిష్కారంపై అధికారులు మానవతా ధృక్పథంతో ఉండాలనీ మున్సిపల్‌ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - ప్రాజెక్ట్‌ నిర్మాణంలో వారి త్యాగం మరువలేనిది

- పెండింగ్‌ సమస్యలను తక్షణమే గుర్తించండి

- ముంపు గ్రామాల యువతకు ఆర్థిక తోడ్పాటు పథకాలు 

- పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ 

సిరిసిల్ల, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మిడ్‌ మానేరు నిర్వాసితులపై ఉదారంగా వ్యవహరించాలనీ, ప్రాజెక్ట్‌ నిర్మాణంలో వారి త్యాగం మరువలేనిదనీ,  వారి సమస్యల పరిష్కారంపై అధికారులు మానవతా ధృక్పథంతో ఉండాలనీ మున్సిపల్‌ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ 11 ముంపు  గ్రామాల్లో పరిహారం అందని అర్హులను తక్షణమే గుర్తించాలని, వారికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాన్వాడ ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి మిగిలిన 197మంది లబ్ధిదారులకు వెంటనే పరిహారాన్ని విడుదల చేయాలన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించి అర్హులైన వారందరికీ పరిహారం అందించాలన్నారు. 18 సంవత్సరాల పరిధిలోకి వచ్చే యువతీయువకులకు అందించాల్సిన పరిహారం విడుదల చేయాలన్నారు. ముంపు గ్రామాల్లోని యువతీయువకులు స్వయం ఉపాధి ద్వారా లబ్ధి పొందే విధంగా ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటును అందించాలని, ఇందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని అన్నారు. ఐఏవై పథకం కింద నిర్వాసితులందరికీ గృహ నిర్మాణ పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.  సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, సిరిసిల్ల  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T05:43:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising