ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడం నగరపాలక సంస్థ బాధ్యత

ABN, First Publish Date - 2020-12-16T05:24:16+05:30

ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడం నగరపాలక సంస్థ బాధ్యత అని, కరీంనగర్‌ను పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుతామని నగర మేయర్‌ వై సునీల్‌రావు తెలిపారు.

అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్న మేయర్‌ సునీల్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేయర్‌ వై సునీల్‌రావు

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 15: ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడం నగరపాలక సంస్థ బాధ్యత అని, కరీంనగర్‌ను పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుతామని నగర మేయర్‌ వై సునీల్‌రావు తెలిపారు. మంగళవారం నగరంలోని 7వ డివిజన్‌ హౌసింగ్‌ బోర్డులో పర్యటించారు. స్థానిక చిల్డ్రన్‌ పార్కులో 5 లక్షల రూపాయల నిధులతో వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణం కోసం స్థానిక కార్పొరేటర్‌ ఆకుల పద్మ ప్రకాశ్‌తో కలిసి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ సునీల్‌రావు మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నగరవ్యాప్తంగా వాకింగ్‌ ట్రాక్‌లు, సైక్లింగ్‌ ట్రాక్‌లు, ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్టన్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి నెలా నగరాభివృద్ధి కోసం 2.50 కోట్ల రూపాయలు నేరుగా విడుదల చేస్తున్నారని తెలిపారు. ఈ నిధులతో నగరంలోని స్మశానవాటికలు, పార్కులను ఆధునీకరించి వాకింట్‌ ట్రాక్స్‌లు, ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ, ఎస్సారార్‌ కళాశాల గ్రౌండ్‌లో సైక్లింగ్‌ ట్రాక్‌లను నిర్మిస్తున్నామని తెలిపారు. నగరంలోని డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులు చేపడుతూనే  మరోవైపు ట్రాక్‌లు, జిమ్‌లు, స్మశాన వాటికల పనులను చేపడుతున్నామని తెలిపారు. నగర ప్రజలు కోరుకున్న విధంగా కరీంనగర్‌ను అన్ని హంగులతో అభివృద్ధి చేసి మెప్పు పొందుతామని మేయర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ ఆకుల పద్మ ప్రకాశ్‌, ఈఈ రామన్‌, డీఈ ఓం ప్రకాశ్‌, ఏఈ వాణి, హౌజింగ్‌ బోర్డు కాలనీవాసులు పాల్గొన్నారు. 

14, 23 డివిజన్లలో పర్యటించిన మేయర్‌

నగరంలోని 14, 23 డివిజన్లలో నగర మేయర్‌ వై సునీల్‌రావు పర్యటించారు. కార్పొరేటర్లు దిండిగాల మహేశ్‌, గుగ్గిళ్ల జయశ్రీతో కలిసి శాలీమార్‌ రోడ్డులో కొనసాగుతున్న స్మార్డ్‌ రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ పార్కును సందర్శించారు. గత కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షం కారణంగా పార్కులో నీరు నిలవడంతోపాటు పార్కులో ఉన్న జిమ్‌, చిల్డ్రన్‌ ప్లే పరికరాలు చెడిపోవడంతో వాటిని పరిశీలించి మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే 23వ డివిజన్‌ ఆదర్శనగర్‌లో పర్యటించి డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు.  పలుచోట్ల డ్రైనేజీ శిథిలమైన వాటిని కూడా మరమ్మతులు చేయాలని కాంట్రాక్టర్లను కోరారు. జవహర్‌లాల్‌ పార్కులో చెడిపోయిన జిమ్స్‌, పిల్లలు ఆట వస్తువులను మరమ్తత్తులు చేపట్టి మల్టీపార్కును వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దిండిగాల మహేశ్‌, గుగ్గిళ్లపు జయశ్రీ, స్మార్ట్‌ సిటీ బృందం ఉన్నారు.

Updated Date - 2020-12-16T05:24:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising