ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పది’ పరీక్షలకు తగిన ఏర్పాట్లు చేయండి

ABN, First Publish Date - 2020-06-05T11:02:27+05:30

పదో తరగతి వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌


కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 4 : పదో తరగతి వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై విద్య, వైద్య,పోలీసు, ఆర్‌డబ్ల్యుఎస్‌, ఆర్టీసీ, రెవెన్యూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టల్‌ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల ఆధ్వర్యంలోని వసతి గృహ విద్యార్థులకు కావల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులకు శానిటైజర్లు, మాస్కులు కూడా సరఫరా చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయాలని, పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్సు సెంటర్లను మూసివేయించాలని పోలీసు అధికారులకు సూచించారు.


విద్యార్థులు పరీక్ష హాల్‌లోకి ప్రవేశించే ముందు మాస్కులు అందించి శానిటైజేషన్‌ చేయించిన తర్వాతనే లోనికి పంపించాలని సూపరింటెండెంట్లకు ఆదేశాలు ఇవ్వాలని డీఈవోకు సూచించారు. అంతేకాక విద్యార్థులు సమదూరం పాటించే విధంగా విశాలంగా సీటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. జలుబు, దగ్గు, జ్వరం, ఏ ఇతర లక్షణాలున్నా అలాంటి వారిని వేరే గదులలో కూర్చోబెట్టాలని డీఈవోను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పవన్‌కుమార్‌, జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్‌, జిల్లా సంక్షేమ అధికారి శారద, పోలీసు, ఆర్టీసీ, ఎంవీఐ, సంక్షేమ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-05T11:02:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising