ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామగుండంలో లిక్కర్‌ సిండికేట్‌

ABN, First Publish Date - 2020-12-01T06:12:21+05:30

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మద్యం వ్యాపారులు సిం డికేట్‌గా మారారు. రామగుండం ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని వైన్స్‌, బార్ల యజమానులు ఎంఆర్‌పీకి మించి అధిక రేట్లపై మద్యం అమ్మకాలు జరపాలని నిర్ణయించారు.

వైన్‌ బాటిల్స్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంఆర్‌పీపై రూ.5 నుంచి రూ.10వరకు అధిక రేటు 

 బీరుకు, క్వార్టర్‌కు రూ.5, ఆఫ్‌, ఫుల్‌కు రూ.10 పెంపు

గోదావరిఖని, నవంబరు 30: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మద్యం వ్యాపారులు సిం డికేట్‌గా మారారు. రామగుండం ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని వైన్స్‌, బార్ల యజమానులు ఎంఆర్‌పీకి మించి అధిక రేట్లపై మద్యం అమ్మకాలు జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం గోదావరిఖనిలోని ఒక మద్యం షాపులో సమావేశమైన వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. గోదావరిఖని, ఎన్‌టీపీసీ, రామగుండం, యైుటింక్లయిన్‌కాలనీ, పా లకుర్తి పరిధిలోని 30వైన్స్‌, ఆరు బార్లలో మంగళవారం నుంచి ఎంఆర్‌పీకి మించి రేట్లపై మద్యం విక్రయాలు జరపాలని నిర్ణయించారు. ఇందులో భా గంగా క్వార్టర్‌కు, బీర్‌కు రూ.5, ఆఫ్‌, ఫుల్‌బాటిల్‌కు రూ.10చొప్పున అధిక రేట్లపై మద్యం విక్రయించాలని తీర్మానించారు. ఒక్కోషాపునకు నెలకు రూ.5లక్షల నుంచి గరిష్టంగా రూ.10లక్షల వరకు లాభం చేకూర్చుకునేలా వ్యూహరచన చేసుకున్నట్టు మద్యం వ్యాపారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ముం దస్తుగా ఒక్కో షాపునకు రూ.70వేల చొప్పున నిధి వసూలు చేయాలని నిర్ణయించారు. రూ.20లక్షల ను ఖర్చుల కింద ముందస్తుగా దగ్గరుంచుకోవాల ని తీర్మానించినట్టు తెలుస్తున్నది. సాధారణంగా ఒక్కో మద్యం షాపు నుంచి ఎక్సైజ్‌ శాఖకు నెలకు రూ.12వే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మద్యం వ్యాపారులు సిం డికేట్‌గా మారారు. రామగుండం ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని వైన్స్‌, బార్ల యజమానులు ఎంఆర్‌పీకి మించి అధిక రేట్లపై మద్యం అమ్మకాలు జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం గోదావరిఖనిలోని ఒక మద్యం షాపులో సమావేశమైన వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. గోదావరిఖని, ఎన్‌టీపీసీ, రామగుండం, యైుటింక్లయిన్‌కాలనీ, పా లకుర్తి పరిధిలోని 30వైన్స్‌, ఆరు బార్లలో మంగళవారం నుంచి ఎంఆర్‌పీకి మించి రేట్లపై మద్యం విక్రయాలు జరపాలని నిర్ణయించారు. ఇందులో భా గంగా క్వార్టర్‌కు, బీర్‌కు రూ.5, ఆఫ్‌, ఫుల్‌బాటిల్‌కు రూ.10చొప్పున అధిక రేట్లపై మద్యం విక్రయించాలని తీర్మానించారు. ఒక్కోషాపునకు నెలకు రూ.5లక్షల నుంచి గరిష్టంగా రూ.10లక్షల వరకు లాభం చేకూర్చుకునేలా వ్యూహరచన చేసుకున్నట్టు మద్యం వ్యాపారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ముం దస్తుగా ఒక్కో షాపునకు రూ.70వేల చొప్పున నిధి వసూలు చేయాలని నిర్ణయించారు. రూ.20లక్షల ను ఖర్చుల కింద ముందస్తుగా దగ్గరుంచుకోవాల ని తీర్మానించినట్టు తెలుస్తున్నది. సాధారణంగా ఒక్కో మద్యం షాపు నుంచి ఎక్సైజ్‌ శాఖకు నెలకు రూ.12వేల చొప్పున మామూళ్లు వెళుతుంటాయని, ఇప్పుడు అదనంగా షాపునకు రూ.10వేల నుంచి రూ.20వేలు ఆశాఖకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గోదావరిఖని ఎక్సైజ్‌ పరిధి లో నెలకు రూ.15కోట్ల నుంచి రూ.20కోట్ల వరకు మద్యం వ్యాపారం జరుగుతోంది. ప్రభుత్వం ఇచ్చే మార్జిన్‌కు తోడు అదనంగా వసూలు చేయాలని నిర్ణయించడం చర్చనీయాంశం అయ్యింది. రామగుండం ప్రాంతంలో కార్మికవర్గం ఎక్కువగా ఉండడంతో మద్యం అమ్మకాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రభుత్వం ఇటీవలె కరోనా సెస్‌ పేర మద్యం రేట్లను కూడా పెంచింది. ఇదే మద్యం ప్రియులకు అదనపు భారమనే పరిస్థితి ఉంది. ఇప్పుడు మద్యం వ్యాపారులు సిండికేట్‌ అయి రేట్లు పెంచుతుండడం దుమారారాన్ని రేకెత్తిస్తోంది. వివదాస్పదంగా ఎక్సైజ్‌ శాఖ వైఖరి.. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎక్సైజ్‌శా ఖ వైఖరి కొన్నాళ్లుగా వివాదంగా మారింది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఎక్సైజ్‌ అండతోనే మద్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలిందనే ఆరోపణలు వచ్చాయి. మద్యం వ్యాపారంలో భాగస్వామ్యుల మధ్య వి

వాదాలు జరిగి పంచాయితీలు జరిగిన సందర్భా ల్లో, లాక్‌డౌన్‌ సమయంలో ఎక్సైజ్‌ మామూళ్ల వ్యవహారం వారి లెక్కల పుస్తకాల్లో బయట పడడం కొ త్త చర్చకు దారితీసింది. ఇప్పుడు ఏకంగా వ్యాపారులు సిండికేట్‌ అయి రేట్లు పెంచేలా ఎక్సైజ్‌శాఖ అండదండలు అందిస్తోందనే ఆరోపణలున్నాయి.

Updated Date - 2020-12-01T06:12:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising