ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చివరి గింజ వరకు కొంటాం

ABN, First Publish Date - 2020-04-07T10:22:39+05:30

రైతలు ఆందోళన చెందవద్దని, చివరి గింజ వరకు కొంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి గంగుల కమలాకర్‌

పలు చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం


కరీంనగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 6: రైతలు ఆందోళన చెందవద్దని, చివరి గింజ వరకు కొంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సోమవారం ఆయన కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రబీ సీజన్‌లో 45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ప్రస్తుతం అది కోటి మెట్రిక్‌ టన్నులకు చేరే అవకాశం ఉందన్నారు.


గతంలో రాష్ట్రంలో మూడు వేల కొనుగోలు కేంద్రాలుంటే కరోనా వైరస్‌ దృష్ట్యా సీఎం కేసీఆర్‌ సూచన మేరకు 6900 కేంద్రాలకు పెంచామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 224 కేంద్రాలు ఏర్పాటు చేసి 4,520 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొన్నామన్నారు. జిల్లాలో 339 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ మారం గంగారెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీ పిల్లి శ్రీలత, పిట్టల రవీందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-07T10:22:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising