ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిడ్స్‌ మహమ్మారి లేని సమాజాన్ని నిర్మిద్దాం

ABN, First Publish Date - 2020-12-02T05:26:00+05:30

ఎయిడ్స్‌ మహమ్మారి లేని సమాజ నిర్మానానికి అన్ని వర్గాల వారు తమవంతు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌ అన్నారు.

జిల్లా కేంద్రంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌

- ఘనంగా ఎయిడ్స్‌ డే

పెద్దపల్లి కల్చరల్‌, డిసెంబరు 1: ఎయిడ్స్‌ మహమ్మారి లేని సమాజ నిర్మానానికి అన్ని వర్గాల వారు తమవంతు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ప్రసంగించారు. జిల్లాలో కొన్ని సంవ త్సరాలుగా ఎయిడ్స్‌పై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మని తెలిపారు. దీని ఫలితంగా జిల్లాలో హెచ్‌ఐవీ కేసులు తగ్గాయన్నా రు. ఈ సంవత్సరం కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ర్యాలీలు నిర్వహించ డం లేదని తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసు పత్రుల్లో అవగాహన బ్యానర్‌లు ప్రదర్శిస్తున్నామని తెలిపారు. ఎయిడ్స్‌ వ్యాధి ఎపుడు వస్తుందో తెలియదు కాని, దాని బారినపడి చనిపోయిన తరువాత అందరికి తెలియపరుస్తుందన్నారు. ఎయిడ్స్‌ వ్యాధికి చికిత్స లేదని, అది రాకుండా నివారించడమే మార్గమన్నారు. సాంఘిక కట్టుబా ట్లు లేనిచోట, విశృంఖల శృంగారం, జరిపేచోట ఈ వ్యాధి ఎక్కువగా వ స్తుందన్నారు. జీవితం, సమాజం, కట్టుబాట్లపై ఆలోచనలేక చాలామంది నాశనమవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత దీనిబారిన ఎ క్కువగా పడుతున్నారని, చదువుకున్న వారైనా సరైన అవగాహన లేకపో వడమే ఈ వ్యాధి వ్యాప్తికి కారణమని అన్నారు. నాగరికత అభివృద్ధి చెం దుతున్నకొద్దీ వింత పోకడలు వస్తున్నాయని, హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చిన వారు ఏఆర్‌టీ మందులు తప్పనిసరిగా వాడడం మొదలుపెట్టాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు సుల్తానాబాద్‌, మంథని, గోదావరిఖని, ఎన్టీపీసీ టీబీ సెంటర్‌, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌ఐవీ స్ర్కీ నింగ్‌ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ వారు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాసుదేవారెడ్డి, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ పీఆర్‌ శ్రీనివాస్‌, వైద్య, ఆరోగ్య శాఖ అధికారు లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T05:26:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising