ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ల సమాఖ్య చైర్మన్‌గా కొండూరు రవీందర్‌రావు

ABN, First Publish Date - 2020-12-29T05:30:00+05:30

తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు జాతీ య కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ల సమాఖ్య (నాఫ్స్‌క్యాబ్‌) చైర్మ న్‌గా ఎంపి కయ్యారు.

కొండూరు రవీందర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణకు దక్కిన అరుదైన అవకాశం

సిరిసిల్ల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు జాతీ య కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ల సమాఖ్య (నాఫ్స్‌క్యాబ్‌) చైర్మ న్‌గా ఎంపి కయ్యారు. మంగళవారం ముంబయిలో జరి గిన సమావేశంలో ఆయనను సభ్యులు ఎన్నుకున్నారు. ఇదే సందర్భంలో 2018 - 2019కుగాను ఉత్తమ ఫర్‌ ఫార్మెన్స్‌ అవార్డును అందుకున్నారు. రవీందర్‌రావు ఐదు సంవత్సరాల పాటు చైర్మన్‌గా కొనసాగుతారు. దేశంలోని 34  రాష్ట్ర సహ కార బ్యాంక్‌లు, 393 జిల్లా కో ఆపరేటివ్‌ బ్యాంక్‌లు, 90 వేల ప్రాథమిక వ్యవసా య సహకార సొసైటీల భాగ స్వామ్యంతో జాతీయ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ సమా ఖ్య ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని సింగిల్‌ విం డో అధ్యక్షుడుగా ఎంపికైన కొండూరు రవీందర్‌రావు రెండు పర్యాయాలు కరీం నగర్‌ కో ఆపరేటివ్‌ సహాకార బ్యాంక్‌ చైర్మన్‌గా ఉంటూ టెస్కాబ్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా కొండూరు రవీందర్‌రావును అంతర్జాతీయ కో ఆపరేటివ్‌ అలయన్స్‌ వైస్‌ చైర్మన్‌, ఎంపీ చంద్రపాల్‌సింగ్‌ యాదవ్‌, నాబార్డు చైర్మన్‌ చింతల గోవిందరాజు అభినందించారు.


 మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు 

జాతీయ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ల సమాఖ్య చైర్మన్‌గా ఎన్నికైన కొండూరు రవీం దర్‌రావుకు పురపాలక, పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు శుభా కాంక్షలు తెలిపారు.  సమాఖ్య చైర్మన్‌గా ఎన్నికైన తొలి వ్యక్తిగా రవీందర్‌రావు ఘ నత సాధించడం తెలంగాణకు గర్వకారణమన్నారు. రాష్ట్రంలోని కో ఆపరేటివ్‌ రంగానికి కొండూరు అందించిన సేవలకు దక్కిన గౌరవమని తెలిపారు. 

Updated Date - 2020-12-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising