ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగిత్యాలలో కరువైన నియంత్రణ

ABN, First Publish Date - 2020-04-05T10:48:22+05:30

సెల్ఫ్‌ డిస్టెన్స్‌ పాటించాలని పదే పదే అధికారులు చెబుతున్నా ప్రజల్లో నియంత్రణ కరువైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెల్ఫ్‌ క్వారంటైన్‌కు ప్రజలు దూరం

కూరగాయల మార్కెట్‌పై కొరవడిన నిఘా


జగిత్యాల, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): సెల్ఫ్‌ డిస్టెన్స్‌ పాటించాలని పదే పదే అధికారులు చెబుతున్నా ప్రజల్లో నియంత్రణ కరువైంది. మాకేమీ కాదులే అన్న ధీమాతో ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదు. జగిత్యాల పట్టణం లోని టవర్‌ ప్రాంతంలో ఉన్న కూరగాయల మార్కెట్‌ ఇరుకుగా ఉండటంతో దానిని పూర్తిగా మూసివేసి జగిత్యాలలోని మినీ స్టేడియం, కొత్త బస్టాండ్‌తో పాటు రైతుబజార్‌లో మార్కెట్‌లను ఏర్పాటు చేశారు.


జగిత్యాల పట్టణవాసులంతా రైతు బజార్‌కే వస్తుండటంతో సెల్ఫ్‌ డిస్టెన్స్‌ లేకుండాపోయింది. టవర్‌ వద్ద ఉన్న మార్కెట్‌ సరిపోవడం లేదని అదనంగా మూడు మా ర్కెట్‌లను ఏర్పాటు చేసిన అధికారులు మూడు రోజులకే మినీ స్టేడియంలో మూసివేయడంతో రైతు బజార్‌లో జన సందడి పెరిగింది.  లాక్‌డౌ న్‌ నేపథ్యంలో ఈ నెల 14 వరకైనా అదనంగా మరో రెండు, మూడు కూరగాయల మారెట్‌లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-04-05T10:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising