ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

ABN, First Publish Date - 2020-06-05T11:03:22+05:30

ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌

 

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 4: ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పార్లమెంట్‌ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఆయన 13వ డివిజన్‌లో కార్పొరేటర్‌ చొప్పరి జయశ్రీ, మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతితో కలిసి పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కేవలం ఈ ఏడు రోజుల కోసమే కాకుండా మన కోసం, సమాజహితం కోసం పరిసరాలను ఎల్లపుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సామాజిక బాధ్యగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు.


వ్యక్తిగత జాగ్రత్తలతోనే కరోనాను కట్టడి చేయవచ్చని సంజయ్‌ పేర్కొన్నారు. గోదాంగడ్డ నుంచి దోబీఘాట్‌ మీదుగా హుస్సేనిపుర వరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో నడుచుకుంటూ వెళ్లి సమస్యలను పరిశీలించారు. ఒడ్డెర గుడిసెల వద్ద డ్రైనేజీ నిర్మించాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ పెద్దపల్లి జితేందర్‌, కాసర్ల ఆనంద్‌, సానిటరీ సూపర్‌వైజర్‌ రాజమనోహర్‌, సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


కమాన్‌ చౌరస్తాలో కలెక్టర్‌ పర్యటన 

ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్‌ కె.శశాంక, కమిషనర్‌ వల్లూరి క్రాంతితో కలిసి కమాన్‌ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం ముందు శిథిలమైన మురుగునీటి కాలువను పరిశీలించారు.  డ్రైనేజీని నిర్మించాలని అధికారులను ఆదేశించారు. మురుగునీటి కాలువల్లో ఎక్కడ కూడా నీరు నిలువకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ రామన్‌, ఏఈ వెంకట్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే 36వ డివిజన్‌లో కార్పొరేటర్‌ గుగ్గిళ్ళ జయశ్రీ,  54వ డివిజన్‌ కార్పోరేటర్‌ ఇఫ్రా తహ్రీన్‌ ఆతిఫ్‌ ఆతిన, 59వ డివిజన్‌లో గందె మాధవి మహేశ్‌, 60వ డివిజన్‌ కార్పొరేటర్‌ వాల రమణారావు ప్రత్యేక పారిశుఽధ్య వారోత్సవాల్లో భాగంగా డివిజన్‌లో పర్యటించారు. 

Updated Date - 2020-06-05T11:03:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising