ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరీంనగర్‌ కాశీ.. పాతబజార్‌ శివాలయం..

ABN, First Publish Date - 2020-02-20T08:54:40+05:30

కాకతీయుల కాలంలో దాదాపు 200సంవత్సరాల క్రితం నిర్మించిన కరీంనగర్‌ పాతబజార్‌ గౌరీ శంకరాలయం(శివాలయం) చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. శుక్రవారం మహా శివరాత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 19: కాకతీయుల కాలంలో  దాదాపు 200సంవత్సరాల క్రితం నిర్మించిన కరీంనగర్‌ పాతబజార్‌ గౌరీ శంకరాలయం(శివాలయం) చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. శుక్రవారం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ చరిత్ర, విశిష్టతపై ప్రత్యేక కథనం..

 చరిత్ర..

కాకతీయ రాజుల కాలంలో శైవాగమ ప్రకారం ఆలయాన్ని నిర్మించారు. నగరానికి ఈశాన్యభాగం లో  భక్తవశంకరుడు కొలువై ఉండడం విశేషం.  15 గుంటల స్థలంలో నిర్మించిన ఈ ఆలయ ద్వార తోరణానికి గణపతి విగ్రహం కన్పిస్తుంది. భారీ ఆకృతిలో శివలింగం దర్శనమిస్తుంది. స్వామికి ఎడ మవైపు గౌరీ, కుడివైపు కన్యకా పరమేశ్వరి కొలువై పూజలందుకుంటున్నారు. 


ఆలయ విశిష్టత..

నగరంలోకెల్లా ప్రాచీనమైన ఈ శివాలయాన్ని దాదాపు మూడు దశాబ్దాల క్రితం దేవాదాయశాఖ తన ఆధీనంలోకి తీసుకొంది. ఆలయంలో ఉన్న సూర్య విగ్రహానికి రథసప్తమి రోజున పూజలు వైభవంగా జరుగు తాయి. సంవత్సరం పొడవునా సంకటహర చతుర్థి మొదలు మహా శివరాత్రి వరకు అన్ని వైదిక పూజా కార్యక్రమాలు సంప్రదాయ పద్ధతి లో నిర్వహిస్తారు. 


శివరాత్రికి ఏర్పాట్లు..

మహాశివరాత్రి పర్వ దినానికి ఏ ర్పాట్లు ఊపందు కున్నాయి. చిన్న హనుమాన్‌ ఆలయం వరకు బారి కేడ్లు నిర్మించారు. ఆలయాన్ని వి ద్యుద్దీపాలతో  అలంకరించారు.  శుక్రవారం ఉదయం నుంచి అర్ధరా త్రి 12 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఈవో పీచర కిషన్‌రావు తెలిపారు. ఉదయం 3.30 గంటలకు సుప్రభాత సేవ, అభిషేకం, 4 గంటల నుంచి అభిషేకాలు, సాయం త్రం 6గంటలకు ప్రదోషకాల పూజ, రాత్రి 9గంటలకు పల్లకీసేవ, రాత్రి 10గంటల నుంచి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, విశేషపూజ, దర్శనం, జాగరణ ఉంటాయని పేర్కొన్నారు.

Updated Date - 2020-02-20T08:54:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising