ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదింటి యువతులకు వరం కల్యాణలక్ష్మి

ABN, First Publish Date - 2020-12-10T05:33:31+05:30

పెళ్లీడుకొచ్చిన నిరుపేద యువతులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు వరం లాంటివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో చెక్కు పంపిణీ చేస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గొల్లపల్లి, డిసెంబరు 9: పెళ్లీడుకొచ్చిన నిరుపేద యువతులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు వరం లాంటివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. బుధవారం స్థానిక ఆర్యవైశ్య సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని ప్రజాసంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజా సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పాలనలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 74 మంది లబ్ధిదారులకు రూ.74,08584 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేసినట్లు తహసీల్దార్‌ పొనగంటి నవీన్‌ తెలిపారు. అనంతరం ఇటీవల ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన చెవులమద్ది చంద్రయ్య, ఉప సర్పంచ్‌ మారం రాజశేఖర్‌ నానమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, బాధిత కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌కు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదడారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-10T05:33:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising