ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి కోసం.. ఎదురుచూపులు

ABN, First Publish Date - 2020-08-09T07:32:25+05:30

జిల్లాలో ఉపాధి హామీ పనులు దొరకక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వంద రోజులు పూర్తి చేసుకున్న 1636 మంది
  • పని దొరకక ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రాంత కూలీలు
  • ప్రత్యామ్నాయం చూపని ప్రభుత్వం


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: జిల్లాలో ఉపాధి హామీ పనులు దొరకక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో చాలా చోట్ల పనులు దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయం చూపాలంటూ ప్రభు త్వం ఆదేశాలు జారీ చేస్తున్నా జిల్లాలో చాలా చో ట్ల పనులు లేక పస్థులుంటున్నారు. 


జిల్లాలో 1,55,280 జాబ్‌ కార్డులు

జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 1,55,280 జాబ్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో 2,72,369 మంది ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కోసం పే ర్లు నమోదు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న వివిధ పనుల్లో వారు పాల్గొంటున్నారు. హరితహారంతో పాటు వైకుంఠధామం, డంప్‌ యార్డులతో పాటు ఇంకా చాలా కార్యక్రమాల్లో వీరు పని చేస్తూ ఉ పాధి పొందుతున్నారు. అయితే ఒక్కో జాబ్‌ కార్డు కింద 100 రోజుల పని కల్పించాలని నిబంధనలు ఉండగా, లాక్‌డౌన్‌ వల్ల ఇప్పుడు ఆ నిబంధన జి ల్లాలోని 1636 మందికి పని లేకుండాపోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని 18 మండలాల్లో 380 గ్రామ పంచాయతీలు ఉండగా, 1636 మంది ఇ ప్పటికే 100 రోజుల పని పూర్తి చేసుకున్నారు. 


ప్రత్యామ్నాయం చూపని ప్రభుత్వం

ఉపాధి హామీ పథకం కింద అందరికి పని క ల్పించాలని ప్రభుత్వం చెబుతున్నా జిల్లాలో అం దరికీ పని దొరకని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 100 రోజుల పని పూర్తి చేసుకున్నవారు 1636 మంది ఉండగా, వారికి ఇప్పుడు ఎలాంటి ప్రత్యామ్నయం చూపడం లేదు. ప్రభుత్వం నుంచి ఎ లాంటి ఆదేశాలు రాకపోవడంతో తామేమీ చేయలేకపోతున్నామని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే 75 రోజులు ప నులు పూర్తి చేసుకున్న కుటుంబాలను గుర్తించి, వారికి అదనంగా మరో జాబ్‌ కార్డు ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో కుటుంబాల సంఖ్య పెరుగడం తో వారికి అదనంగా పని దొరికే అవకాశం ఉంది. కానీ 100 రోజులు పూర్తి చేసుకున్నవారి విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి విధి విఽధానా లు రాలేదని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు.

Updated Date - 2020-08-09T07:32:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising