ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలుకేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ABN, First Publish Date - 2020-10-24T11:01:11+05:30

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ కె శశాంక అధికారులను ఆదేశించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ కె శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌లాల్‌తో కలిసి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద సెంటర్లలో ప్యాడీ క్లీనింగ్‌ మిషన్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్‌ సౌకర్యం తప్పకుండా ఉండాలని అన్నారు. సోమవారం నుంచి మండల స్థాయిలో కొనుగోలు కేంద్రాలపై సమీక్షలు నిర్వహించాలని, ఈ సమీక్షలు ఎమ్మార్వోల ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించారు. ఈ సమీక్షలకు ట్రైనింగ్‌ ఇన్‌చా ర్జిలు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించారు. ట్రైనింగ్‌ రాని వారిని సెంటర్లలోనికి అనుమతించవద్దన్నారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తు ప్రదేశాల్లో ఏర్పా టుచేయాలన్నారు.రైతులకు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రశీదు ఇవ్వాలని సూచించారు.


వరిధాన్యం తరలింపునకు వాహనాలను వెంటవెంటనే పంపించాలని, వాటిని మిల్లుల వారిగా పంపే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతికొనుగోలు కేంద్రంలో కొవిడ్‌భద్రతా నియమాలు పాటించేవిధంగా ఏర్పాటుచేయాలన్నారు. జిల్లాలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు పీఏసీఎస్‌ ద్వారా 222, డీసీఎంఎస్‌ ద్వారా42, ఐకేపీద్వారా78, మెప్మా ద్వారా1,హాకద్వారా1, మార్కెటింగ్‌శాఖద్వారా8, జిల్లాలో మొత్తం 352కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని అన్నారు. జిల్లా వ్యవసాయాధికారి వి శ్రీధర్‌, గ్రామీ ణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్‌రావు, శ్రీకాంత్‌, డీఎస్‌వో సురేష్‌రెడ్డి, పద్మా వతి, శ్రీమాల, మార్క్‌ఫెడ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-24T11:01:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising