ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహనీయులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

ABN, First Publish Date - 2020-11-28T04:39:24+05:30

ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు లాంటి మహనీ యులపై అక్బరుద్దీన్‌ ఓవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికా దని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దయాల మల్లారెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మల్లారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దయాల మల్లారెడ్డి

జగిత్యాల అర్బన్‌, నవంబరు 27: ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు లాంటి మహనీ యులపై అక్బరుద్దీన్‌ ఓవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికా దని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దయాల మల్లారెడ్డి అన్నారు. శు క్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో అ త్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లా రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికా రా న్ని కల్పించిన మహానీయుడు ఎన్‌టి. రామారావు అని, బహు భాషా కోవిదుడు, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుపై చేసిన వాఖ్యలను టీడీపీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల్లో గెలు పోటములు సహజమని, కానీ ఇలాంటి వ్యా ఖ్యలు చేసిన వారికి నష్టమే కానీ లాభం జరగదన్నారు. ఓట్ల కోసం ఇలాంటి నాయకులపై వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరు కోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహంకాళి రాజన్న, పార్లమెంటరీ అధికార ప్రతిని ధి వనమాల నిరంజన్‌, జిల్లా కార్య దర్శి ఏలేటి సురేంధర్‌, ప్రచార కార్యదర్శి కోరుకంటి రాము, టౌన్‌ ప్రెసిడెంట్‌ కొండ శ్రీధర్‌, గుగ్గిల్ల సత్యనారాయణ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు గడ్డం లక్ష్మీపతి, టీఎన్‌ఎస్‌వి అధ్యక్షులు అజ్గర్‌ ఖాన్‌, శంకర్‌, శ్రీనివాస్‌, బుర్ర శ్రీధర్‌ తదితరులున్నారు. 

Updated Date - 2020-11-28T04:39:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising