ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌ఎండీకి భారీ ఇన్‌ఫ్లో

ABN, First Publish Date - 2020-09-21T06:12:18+05:30

కరీంనగర్‌ సమీపంలోని దిగువమానేరు జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

18 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్లు నీరు విడుదల


తిమ్మాపూర్‌, సెప్టెంబరు 20: కరీంనగర్‌ సమీపంలోని దిగువమానేరు జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఆదివారం 18 గేట్ల నుంచి లక్ష  కూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ పూర్తి నీటి సమర్ద్యం 24.034 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రం 23.602 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 


ఎస్సారెస్పీలో..

జగిత్యాల:  శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి1,46,874 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై 32 గేట్లు ఎత్తి గోదావరిలోకి లక్షా 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 


శ్రీరాజరాజేశ్వర జలాశయలో..

బోయినపల్లి: శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి శ్రీరాంసాగర్‌ జలాలతోపాటు వరద నీరు వచ్చి చేరుతోంది.  ప్రాజెక్టు  పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్ర వరకు 25.29 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్ట్‌లోకి 12,093 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వచ్చి చేరుతోంది. ఇందులో ఎస్సారెస్పీ నుంచి 10,368 క్యూసెక్కులు, మానేరు, మూలవాగు నుంచి 1,732 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రాజెక్ట్‌ నుంచి మూడు గేట్ల ద్వారా 9,512 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

Updated Date - 2020-09-21T06:12:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising