ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ABN, First Publish Date - 2020-12-05T05:28:09+05:30

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రభుత్వం అందిస్తున్న పథకాల ను వినియోగించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

పెద్దపల్లి రూరల్‌, డిసెంబరు 4: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రభుత్వం అందిస్తున్న పథకాల ను వినియోగించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండలంలోని సర్పంచ్‌లు, పంచా యతీ కార్యదర్శులు, అధికారులతో అభివృద్ధిపై జిల్లా పంచా యతీ అధికారి గీత ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఈజీఎస్‌ ద్వారా చేపడుతున్న పనులపై ప్రతి గ్రామంలో చేపట్టిన పనులను అడిగి తెలు సుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామా ల్లో కోనసాగుతున్న రైతు వేదిక నిర్మాణాలు, వైకుంఠధామా లు, సెగ్రిగేషన్‌ షెడ్డు నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయా లన్నారు. దీంతో పాటు హరితహరం కార్యక్రమం విజయ వంతం చేసేందుకు ప్రతి గ్రామానికి ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. మండలంలోని ఈజీఎస్‌ ద్వారా చేపడుతున్న పనుల వివరాలను అడుగడంతో  పూర్తి వివ రాలు చెప్పకపోవడంతో మీరే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని, ఇలా ఉంటే మండలంలో ఏమి పనులు జరుగుతాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం సూచించిన విధంగా అధికారులు నిర్వహిస్తున్న విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. అలాగే రాఘవపూర్‌ గ్రామంలో నిర్మించిన రైతువేదిక నిర్మించి రెండు నెలలు గడుస్తున్న కూడా ఇప్పటి వరకు బిల్లులు రాలేదని అధికారులను అడుగడంతో త్వర లోనే వస్తాయని అధికారులు పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపు ల్లో చాలా నిర్లక్ష్యం జరుతుందని పలు గ్రామాలు సర్పంచ్‌ లు అధికారులకు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో, ఇన్‌చార్జి జిల్లా పంచాయతీ అధికారి గీత, మంథని డీఎల్‌పీవో రాంబాబు, పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి, జడ్పీటీసీ రామ్మూర్తి, ఎంపీడీవో రాజుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T05:28:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising