రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలి
ABN, First Publish Date - 2020-12-12T05:02:49+05:30
రైతులంతా ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడి లాభసాటి వ్యవసాయం చేయాలని, తద్వారా లాభాలు గడించాలని ప్రొ ఫెసర్ జయశంకర్ రాష్ట్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్ రావు అన్నా రు.
ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్ రావు
జగిత్యాల అగ్రికల్చర్, డిసెంబరు 11: రైతులంతా ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడి లాభసాటి వ్యవసాయం చేయాలని, తద్వారా లాభాలు గడించాలని ప్రొ ఫెసర్ జయశంకర్ రాష్ట్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్ రావు అన్నా రు. శుక్రవారం పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు చేపడుతున్న వివిధ పరిశోధ నలు పరిశీలించారు. ప్రధానంలో క్షేత్రంలో చేపడుతున్న అగ్గి తెగులు పరిశోధన, మొక్కజొన్నలో జీరో టిల్లేజ్, పంట అవశేషాల యాజమాన్యం, విడుదలకు సిద్ధంగా ఉన్న పలు రకాల నూతన వంగడాలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరుగుతు న్న పరిశోధనలను గమనించి, శాస్త్రవేత్తలతో చర్చించి రైతుల స్థాయికి వాటికి తీసుకెళ్లేందుకు కావల్సిన సలహాలు, సూచనలు అందించారు. అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం దత్తత గ్రామమైన వెల్ధుర్తి గ్రామ రైతుల అనుభవా లను, శాస్త్రవేత్తల పనితీరును అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయంలో నూతన యాజమాన్య పద్ధతులు అవలంభించడానికి, పంట అవశేషాలను తగలబె ట్టకుండా రోటరీ మల్చర్ పద్ధతిలో కొయ్యకాలను చిన్న మొక్కలుగా నేలలో కలియ దున్నడం ద్వారా భూసారం పెంచడంతో పాటుగా, పచ్చిరొట్ట, ఎరువులు వేయడం, భూసార పరీక్ష ఆధారంగా పంటకు ఎరువులు వేయడం, వరి యంత్రం ద్వారా నాట్లు వేస్తున్నామని ఆదర్శరైతుల రాంకిషన్, వీసీ ప్రవీణ్‌రావుకు తెలిపారు. ల క్ష్మీపూర్ గ్రామంలో ఏర్పాటుచేసుకున్న రైతు ఉత్పత్తి కంపెనీకి ఆర్‌ఏఆర్‌ఎస్ శా స్త్రవేత్తలు కొత్త విత్తనాలు అందించి ప్రోత్సహిస్తున్న తీరును, నూతన వ్యవసాయ పద్ధతులపై గ్రామాల్లో ప్రదర్శిస్తున్న తీరు, పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అ వగాహన కార్యక్రమాలు, ప్రదర్శన, వెబ్‌నార్ ద్వారా రైతులకు సేవలు అందిస్తు న్న ఏడీఆర్ ఉమారెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, రైతులతో పాటు వ్యవసాయ కళాశాల అసోసీయేట్ డీన్ డాక్టర్ నరేంధర్‌రెడ్డి, కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T05:02:49+05:30 IST