ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు పరిహారం అందించాలి

ABN, First Publish Date - 2020-10-21T05:58:08+05:30

ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌


హుజూరాబాద్‌, అక్టోబరు 20: ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌ శివారులోని సిర్సపల్లి రోడ్‌లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల భూసార పరీక్షల కోసం 125 కోట్లు కేటాయిస్తే ఎక్కడా భూసార పరీక్షలు నిర్వహించలేదన్నారు. ప్రభుత్వం దెబ్బతిన్న పంటలను కొనుగోలు చేసి ఎమ్మెస్పీ కంటే అదనంగా 500 రూపాయలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాకేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు పోరెడ్డి కిషన్‌రెడ్డి, సంపత్‌రావు, శంతన్‌రెడ్డి, ముత్యంరావు, బింగి కరుణాకర్‌, మహేందర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, పైళ్ల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.


ఎంపీకి వినతి పత్రం అందజేసిన పోస్టల్‌ ఉద్యోగులు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌

కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ ప్రధాన రహదారి రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు శ్రావణ్‌, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి సతీష్‌లు వినతి పత్రం అందజేశారు. తపాలా ఉద్యోగులు తమకు బోనస్‌ ఇప్పించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.

Updated Date - 2020-10-21T05:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising