ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష

ABN, First Publish Date - 2020-03-16T11:45:14+05:30

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

8 7,136 మందికి 5,930 మంది విద్యార్థులు హాజరు 8 కరోనా భయంతో మాస్క్‌లతో పరీక్షకు


తిమ్మాపూర్‌, మార్చి 15: మహాత్మా జ్యోతి బాఫూలే వెనుకబడిన తరగతుల గురు కుల సొసైటీ నిర్వహించిన 6,7,8వ తరగతులకు సంబం దించి ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ఎం.తిరుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6,7,8 తరగతులలో బ్యాక్‌లాగ్‌ ఖాళీల కు గాను 7,136 మంది ధరాఖాస్తు చేనుకున్నారన్నా రు.  ఆదివారం జరిగిన ప్రవేశ పరీక్ష కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,930 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 1,206 మంది గైర్హాజరైనట్లు ఆర్‌సీవో తిరుపతిరెడ్డి తెలిపారు. ఉదయం 10గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పరీక్షా కేంద్రాలు దొరకక ఇబ్బందులు పడ్డారు. దీంతో కొందరు విద్యార్థులు పరీక్ష సమయానికి హాజరు కాకపోవడంతో అధికా రులు లోపలికి అను మతి ఇవ్వలేదు.  దీంతో పలువురు విద్యార్థులు వారి తల్లి దండ్రులు నిరాశతో వెనుదిరిగారు. ఈ పరీక్షలను ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఆర్‌సీవో ఎం.తిరుపతిరెడ్డి పర్యవేక్షిం చారు. వీరితో పాటు స్పెషల్‌ ఆఫీసర్లు కట్ట వేణుగోపాల్‌, ఎం.మధుసూదన్‌, వి.రాఘవ రెడ్డిలు పాల్గొన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ భయంతో పరీక్షా కేంద్రా లకు పలువురు విద్యార్థులు మాస్క్‌లు, కర్చీప్‌లతో హాజరయ్యారు. 

Updated Date - 2020-03-16T11:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising