ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని పండుగలకు సమాన ప్రాధాన్యం

ABN, First Publish Date - 2020-11-13T10:11:00+05:30

కులమతాలకతీతంగా అన్ని పండుగలకు సమాన ప్రాధాన్యతనిచ్చి అవసరమైన అన్ని ఏర్పా ట్లను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నామని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు. గురువారం కార్ఖానగడ్డ దళితుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు 

మేయర్‌ యాదగిరి సునీల్‌రావు 


కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 12: కులమతాలకతీతంగా అన్ని పండుగలకు సమాన ప్రాధాన్యతనిచ్చి అవసరమైన అన్ని ఏర్పా ట్లను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నామని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు. గురువారం కార్ఖానగడ్డ దళితుల శ్మశానవాటికను ఆయన సందర్శించారు. సమాధుల వద్ద జరుపుకునే పండుగకు అన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమాధుల మధ్య ఉన్న కలుపుమొక్కలను తొలగించి చదను చేయాలని, శ్మశానవాటిక చుట్టూ ఉన్న ప్రహరీకి సున్నం వేయించాలని ఆదేశించారు. లైట్లను ఏర్పాటు చేయాలని, పండుగకు ఒక రోజు ముందే అన్ని పనులు పూర్తికావాలని సూచించారు. నగరంలోని నాలుగు శ్మశానవాటికల్లో ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దీపావళి పండుగను కుటుంబసభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని మేయర్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్‌, ఎడ్ల సరిత, గంట కల్యాణి, ఏఈ ఆసీఫ్‌, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.


అన్ని డివిజన్లలో హైమాస్ట్‌ లైట్ల ఏర్పాటు..

నగరంలోని అన్ని డివిజన్లలో హైమాస్ట్‌, మినీహైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేస్తున్నామని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు. గురువారం 33వ డివిజన్‌లో ఏడు చోట్ల ఏర్పాటు చేసిన మినీ హైమాస్ట్‌ లైట్లను ఆయాకాలనీల ప్రజలతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగర సుందరీకరణతోపాటు కాలనీల్లో చీకటి లేకుండా ఉండేందుకు మినీ హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే చాలా చోట్ల లైట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలో మరో 100 హైమాస్ట్‌ లైట్లను, 300విద్యుత్‌ స్థంభాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. వీధి దీపాల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ నాయకులు అంజన్‌రావు, కుంబం అనిల్‌, సంజీవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T10:11:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising