ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పెషల్‌ జ్యూరీ అవార్డుకు ఎంపికైన డీటీసీ

ABN, First Publish Date - 2020-09-20T07:08:48+05:30

స్పెషల్‌ జ్యూరీ అవార్డుకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ డాక్టర్‌ పుప్పాల శ్రీనివాస్‌ ఎంపికయ్యారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూగ, చెవిటి వారికి డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించిన పుప్పాల శ్రీనివాస్‌


తిమ్మాపూర్‌, సెప్టెంబర్‌19 : ఢిల్లీకి చెందిన ఎంఫాసిస్‌ యూనివర్శల్‌ డిజైన్‌ అవార్డ్స్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా అందజేసే స్పెషల్‌ జ్యూరీ అవార్డుకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ డాక్టర్‌ పుప్పాల శ్రీనివాస్‌ ఎంపికయ్యారు. వాహనాలు నడుపడంలో చెవిటి,మూగ వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌లు జారీ చేయడంలో ప్రత్యేక చొరువ తీసుకున్నందుకు స్పెషల్‌ జ్యూరీ- 2020అవార్డుకు ఆ సంస్థ శ్రీనివాస్‌ను ఎంపిక చేసింది.  దాదాపు 50 మంది చెవిటి,మూగ వాళ్లకు రోడ్డు నియమ నిబంధనలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌కు తీసుకున్న ప్రత్యేక చొరవ,  వినికిడి శక్తిని అధిగమించేందుకు ఆయన చేసిన కృషిని గుర్తించి అవార్డుకు ఎంపిక చేసినట్లు సంస్ధ ప్రతినిధులు తెలిపారు. ఢిల్లీలో సెప్టెంబర్‌ 28న సంస్ధ నిర్వహించే కార్యక్రమంలో లాంఛనంగా డీటీసీ శ్రీనివాస్‌ అవార్డు అందుకోవాల్సి ఉండాగా కరోనా కారణంగా ఆన్‌లైన్‌లోనే ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌ను రావాణా శాఖ కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు అభినందించారు.

Updated Date - 2020-09-20T07:08:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising