ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ విత్తనాలతో నష్టపోవద్దు

ABN, First Publish Date - 2020-06-18T10:34:19+05:30

నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని, గుర్తింపు పొందిన దుకాణాలలో మాత్రమే విత్తనాలు కొనుగోలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ కె శశాంక

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్‌: పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి


కరీంనగర్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని, గుర్తింపు పొందిన దుకాణాలలో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ కె శశాంక రైతులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ అధికారులతో నకిలీ పత్తి విత్తనాల నిర్మూలనపై సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మకుండా వ్యవసాయ అధికారులు పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతో నిర్మూలించాలని తెలిపారు. రైతులు నకిలీ విత్తనాలు అమ్మే డీలర్లతో మోసపోకూడదని అన్నారు. పత్తిలోనే ఎక్కువ నకిలీ విత్తనాలు రావడానికి అవకాశం ఉంటుందని, అధికారులు నకిలీ విత్తనాలు అమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు రెండు నకిలీ విత్తనాల షాపులను సీజ్‌ చేయడం జరిగిందని అన్నారు.


నకిలీ విత్తనాలు ఎవరు అమ్మినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని అన్నారు. అనంతరం సీపీ కమలాసన్‌ రెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలను గుర్తించుటకు పోలీసు అధికారులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మినవారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడం జరుగుతుందని అన్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు నాలుగు పీడీ యాక్టులు బుక్‌ చేయడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, పోలీసు అధికారులు శ్రీనివాస్‌, వ్యవసాయాధికారులు తదదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-18T10:34:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising