ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధర్మపురిలో వైభవంగా కార్తీక వేడుకలు

ABN, First Publish Date - 2020-12-01T06:15:31+05:30

ధర్మపురి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి ఆలయం కోనేరు వద్ద దీపాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మపురి, నవంబరు 30: ధర్మపురి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మపుష్కరిణి (కోనేరు)లో పంచసహస్ర దీపాలంకరణ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏటా నిర్వహించే విధంగా బ్రహ్మపుష్కరిణి మధ్య గల భోగ మండపంలో ప్రత్యేక వేదిక పైన నరసింహస్వామి, లక్ష్మీదేవి చిత్రపటాలను ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, కలెక్టర్‌ గుగులోతు రవి, జాయింట్‌ కలెక్టర్‌ రాజేశం జ్యోతి ప్రజ్వలన చేసి దీపాలంకరణ ప్రారంభించారు. బ్రహ్మపుష్కరిణి (కోనేరు) అందంగా దీపాలతో శోభిల్లింది. ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్‌ శర్మ తదితద వేద బ్మాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహణాఽధికారి సంకటాల శ్రీనివాస్‌, ధర్మపురి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు. గోదావరి నది వద్ద సోమవారం రాత్రి గంగాహారతి ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  అనేక మంది మహిళలు దీపాలు వెలిగించి నదిలో వదిలారు. దీంతో పదిహేను రోజుల పాటు జరిగిన హారతి కార్యక్రమం ముగిసింది. అంతకు ముందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారలను దర్శనం చేసుకున్న జగిత్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి దంపతులు, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రాజేశం దంపతులు పంచ సహస్ర దీపాలంకరణ, గంగా హారతి ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-01T06:15:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising