సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను ఛేదించవచ్చు
ABN, First Publish Date - 2020-12-16T05:21:14+05:30
అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి నేరాలైనా ఛేదించవచ్చునని కరీంనగర్ పోలీస్‌కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు.
సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి
కరీంనగర్ క్రైం, డిసెంబరు 15 : అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి నేరాలైనా ఛేదించవచ్చునని కరీంనగర్ పోలీస్‌కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు. కమిషనరేట్ కేంద్రంలో పోలీసు అధికారులతో మంగళవారం నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేర సంఘటన ప్రాంతంలో సునిశిత పరిశీలన, భౌతిక ఆధారాల సేకరణ, దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తే ఎంతటి క్లిష్టమైన కేసు అయినా ఛేదించవచ్చన్నారు. నేర ఘటన సమాచారం తెలిసిన వెంటనే అందుబాటులో ఉన్న పోలీసు అధికారులను ఘటనా స్థలానికి పంపిం చి, ఆధారాలు చెదిరిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యాచార సంఘట నలలో ఆధారాలను డీఎన్‌ఏకు నివేదిక పంపించటంతో పాటు, భౌతిక ఆధారాల సేకరణ ద్వారా నిందితులను సులభంగా గుర్తించవచ్చన్నారు. ఎస్సీఎస్టీ కేసుల్లో వేగవంతంగా విచారణ పూర్తి చేసి, నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానాల్లో హాజరుపరచాలన్నారు. నిర్ణీత గడువులోపు దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానాల్లో ఛార్జిషీట్ దాఖలు చేయాలని, అననంతరం సీసీ నెంబర్లు తీసుకుని సీసీటీఎన్ ఎస్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. మహిళల మెడలో పుస్తెలతాళ్లను, ఇతర ఆభరణాలను దొంగిలించిన కేసులను ఛాలెంజింగ్‌గా తీసుకుని ఛేదించాల న్నారు. ఈ నెల చివరి వరకు ప్రతి పోలీసుఠాణా పరిధిలో 10 సీసీ కెమెరాలు ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయించాలని, రెండు నుంచి మూడు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ వారెంట్లను వేగ వంతంగా అమలు చేయాలన్నారు. రాబోవు సంవత్సరంలో కూడా కరీంనగర్ కమిషనరేట్‌లోని పోలీసుఠాణా దేశవ్యాప్తంగా మరోసారి గుర్తింపు వచ్చేలా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలని సీపీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్, జీ చంద్రమోహన్, ఏసీపీలు పీ అశోక్, జే విజయసారధి, సుందరగిరి శ్రీనివాసరావు, మదన్‌లాల్, సోమనాథం, కే శ్రీని వాస్, ఎస్‌బీఐ ఇంద్రసేనారెడ్డి పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-16T05:21:14+05:30 IST