ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేట్‌ శక్తులకు కొమ్ము కాస్తున్న కేంద్రం

ABN, First Publish Date - 2020-12-13T05:36:31+05:30

కేంద్ర ప్రభుత్వం మూడు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తోందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పొనగంటి కేదారి విమర్శించారు.

రేణికుంట టోల్‌ గేట్‌ వద్ద రాస్తారోకో చేస్తున్ననాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి

తిమ్మాపూర్‌, డిసెంబరు 12: కేంద్ర ప్రభుత్వం మూడు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి  కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తోందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పొనగంటి కేదారి విమర్శించారు. శనివారం మండలంలోని రేణికుంట రాజీవ్‌ రాహదారి పై ఉన్న టోల్‌గేట్‌ వద్ద కేంద్రం తీసుకు వచ్చిన నూత న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సీపీఐ, సీపీఎం, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేదారి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి దేశ ప్రజలను ఇ బ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. నూతన చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే ప్రధాని స్పందించడం లేదన్నారు. దేశ సం పదను కార్పొరేట్‌ శక్తులకు పెట్టుబడిదారులకు, బహు ళ జాతి సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ నిర్వీర్యం చేస్తున్నారన్నారు. దేశానికి అన్నం పెట్టె రైతులను, వ్యవసాయ రంగాన్ని విచ్ఛి న్నం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్‌గేట్‌ వద్ద రాస్తారోకో నిర్వహించడంతో రాజీవ్‌ రాహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఆందోళన చేస్తున్న నాయకుల ను ఎల్‌ఎండీ పోలీసుల అరెస్టు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహా య కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్‌, జీవీ రమణారెడ్డి, కరీంనగర్‌, తిమ్మాపూర్‌, చిగురుమామిడి, గన్నేరువరం, సైదాపూర్‌ మండలాల కార్యదర్శులు కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, బోయిని తిరుపతి, నాగెల్లి లక్ష్మారెడ్డి, కాంతాల అంజి రె డ్డి, గుండేటి వాసుదేవ్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బండ రాజిరెడి, సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు బోనగిరి మహేందర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు  యుగేం దర్‌, సీపీఎం రైతు సంఘం జిల్లా కార్యదర్శి వర్ణ వెంక ట్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుడికందుల సత్యం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్‌,  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-13T05:36:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising