ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాటన్‌ చీరల తయారీ కూలి పెంచాలి

ABN, First Publish Date - 2020-12-16T04:59:37+05:30

కాటన్‌ చీరల తయారీ కూలి పెంచాలని కార్మికులు, ఆసాములు డిమాండ్‌ చేశారు. మంగళవారం సిరిసిల్లలోని చేనేత జౌళీశాఖ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూల అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

సిరిసిల్లలోని చేనేత జౌళీ శాఖ ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 15 : కాటన్‌ చీరల తయారీ కూలి పెంచాలని కార్మికులు, ఆసాములు డిమాండ్‌ చేశారు. మంగళవారం సిరిసిల్లలోని చేనేత జౌళీశాఖ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూల అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా నాయకులు ఏఐటీయూసీ గౌరవ అఽధ్యక్షుడు సామల మల్లేశం, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌  మాట్లాడుతూ కాటన్‌ చీరల తయారీ కష్టంతో కూడుకున్న పని అన్నారు. యజమానులు కార్మికుల కష్టాలను గుర్తించకుండా శ్రమకు తగ్గ కూలిని ఇవ్వడం లేదన్నారు.  అధికారులు స్పందించి యాజమానులతో చర్చించాలని, తొమ్మిది గజాల కాటన్‌ చీర తయారు చేసిన కార్మికుడికి రూ.110 కూలి పెంచడంతోపాటు అసాములకు రూ.160 చెల్లించేలా  చూడాలని  వినతిపత్రం అందించారు.  ఏఐటీయూసీ  అధ్యక్షుడు పోలు కొమురయ్య, కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్‌, బూర శ్రీనివాస్‌, అజ్జ వేణు, వైపని వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు గణేష్‌, పులి గోపాల్‌, ప్రశాంత్‌, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు పాసికంటి శ్రీనివాస్‌, జెల్ల తిరుపతిరావు, మీసం లక్ష్మన్‌, కోడూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T04:59:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising