ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో కొత్తగా 136 మందికి కరోనా

ABN, First Publish Date - 2020-09-24T07:08:41+05:30

జిల్లాలో కొత్తగా మరో 136 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా ఆస్పత్రిలో ఇద్దరి మృతి 

చొప్పదండిలో అత్యధికంగా 20 పాజిటివ్‌ కేసులు 


కరీంనగర్‌, సెప్టెంబర్‌ 23(ఆంధ్రజ్యోతిప్రతినిధి): జిల్లాలో కొత్తగా మరో 136 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. కరీంనగర్‌ పట్టణంలోని కాశ్మీరుగడ్డకు చెందిన 55 సంవ త్సరాల వ్యక్తితో పాటు మారుతీనగర్‌కు చెందిన 65 ఏళ్ల మహిళా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి కొవిడ్‌ చికిత్స పొందుతూ మరణించారు.  బుధవారం అత్యధికంగా చొప్పదండి మండలంలో 20 మందికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే  హుజురాబాద్‌ డివిజన్‌పరిధిలోని జమ్మి కుంట మండలంలో 18  మందికి , హుజురాబాద్‌ మండ లంలో 186 మందికి పరీక్షలు నిర్వహించగా 17 మందికి, శంకరపట్నం మండలంలో నలుగురికి, వీణవంక మండలం లో ఐదుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇల్లందకుంట మండలంలో 74 మంది కోవిడ్‌ పరీక్షలు చేయించుకోగా 15 మందికి వ్యాధిసోకినట్లు నిర్ధారణ అయింది.


సైదాపూర్‌ మండలంలో 29 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పా జిటివ్‌ వచ్చింది. అలాగే కరీంనగర్‌ డివిజన్‌ పరిధిలోని చొప్పదండి మండలంలో 72 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా 20 మందికి, గంగాధర మండలంలో 51 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి, రామడుగు మండలంలో 51 మందికి పరీక్షలు చేయగా నలుగురికి, చిగురుమామిడి మండలంలో 48 మంది పరీక్షలు చేయించుకోగా ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చింది.


తిమ్మాపూర్‌ మండలంలో 43 మందికి టెస్ట్‌లు నిర్వహించగా 9 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.మానకొండూర్‌ మండలంలో 14 మంది,  కొత్తపల్లి మండలంలో ఐదుగురు వ్యాధిబారినపడ్డారు. కరీంనగర్‌ పట్ట ణంలోని కాపువాడలో ఇద్దరికి, మారుతీనగర్‌లో ముగ్గురికి, లక్ష్మీనగర్‌లో ముగ్గురికి, కోతిరాంపూర్‌లో ఇద్దరికి, అశోక్‌న గర్‌లో ఇద్దరికి, హౌసింగ్‌బోర్డుకాలనీలో ఇద్దరికి, సప్తగిరికా లనీలో ఒకరికి, సుభాష్‌నగర్‌లో ఇద్దరికి, కిసాన్‌నగర్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

Updated Date - 2020-09-24T07:08:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising