ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దపల్లి జిల్లాలో మరో 23 మందికి కరోనా.. 1105కు చేరుకున్న కేసుల సంఖ్య

ABN, First Publish Date - 2020-08-11T20:37:16+05:30

జిల్లాలో ఆదివారం మరో 23 మందికి కరోనా సోకిందని సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖాధికారులు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం మరో 23 మందికి కరోనా సోకిందని సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖాధికారులు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో జిల్లాలో 1,105కు కరోనా బాధితుల సంఖ్య చేరుకున్నది. రోజు వారీగా చేపడుతున్న యాంటిజెన్‌ ర్యాపిడ్‌ కిట్ల ద్వారా పరీక్షలు కొనసాగుతున్నాయి. వైరస్‌ సోకిన వారందరికీ ఇంటి వద్దనే చికి త్స అందిస్తున్నారు. వ్యాధి మరింత విస్తరించకుండా ఉండేందుకు ఆయా గ్రామాల్లో చర్యలు తీసుకుంటున్నారు. పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్‌ గ్రామంలో కేసుల సంఖ్య పెరుగుతండడంతో గ్రామంలో ఉదయం 11 గంటల వరకే కిరాణా షాపులను నడిపించాలని, బెల్టు షాపులను మూసి వేయాలని పంచాయతీ పాలక వర్గం తీర్మానించింది. ఇలా ఆయా గ్రామాల్లో కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. 


‘కాలనీ’లో వంద దాటిన కేసులు..

యైుటింక్లయిన్‌కాలనీ: కాలనీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య సోమవారం తో వంద దాటింది. అల్లూరు పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఎనిమిది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరితో నమోదైన పాజిటీవ్‌ కేసుల సంఖ్య 101కి చేరింది. జూన్‌ 8న ఒకే రోజు రెండు కేసులు నమోదయ్యాయి. వీరిద్దరు సింగరేణి కార్మికులు కాగా వీరు మృతిచెందారు. జూన్‌ చివరి నాటికి నాలుగు కేసులు ఉండగా జూలై చివరినాటికి 41 కేసులు నమోదయ్యాయి. ఈ పదిరోజుల్లోనే 56 మందికి కరోనా సోకింది. కేవలం కరోనాతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మిగతా వారందరు పెద్ద ఆరోగ్య సమస్యలు లేకుండానే ఉన్నారు. దాదాపు 50 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 52 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం 13 మంది సింగరేణి క్వారైంటన్‌లో ఉన్నారు.


కరోనా వ్యాధి లక్షణాలతో వ్యాపారవేత్త మృతి

కరోనా వ్యాధి లక్షణాలతో గత కొద్ది రోజులగా బాధపడుతూ హైదారాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మంథనికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త సోమవారం ఉదయం మృతి చెందాడు. మంథ నిలో ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు చేయూతనివ్వడంతో పాటు గోదావరినది పుష్కరాల సందర్భంగా సదురు వ్యాపార వేత్త కుటుం బం 12 రోజుల పాటు వేలాది మంది భక్తులకు అన్నదానం చేశారు. వ్యాపారి అకాల మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మంథని ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  వ్యాపారి మృతి పట్ల సంతాపంగా మండలంలోని రా, పారాబాయిల్డ్‌ రైస్‌ మిల్లులను మూసివేశారు. 


మరో ఐదుగురికి కరోనా పాజిటివ్‌..

మండలంలోని గద్దలపల్లి పీహెచ్‌సీలో సోమవారం 30 మంది కరోనా టెస్టులు నిర్వంచగా ఇందులో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మంథని పట్టణానికి చెందిన ఇద్దరికి,  మండలంలోని సూరయ్యపల్లి, కన్నాల, సెంటినరీకాలనీలకు చెందిన ఒక్కోకరికి పాజిటివ్‌గా వచ్చింది. 

Updated Date - 2020-08-11T20:37:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising