నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలి
ABN, First Publish Date - 2020-12-30T04:24:32+05:30
దేశంలోనే తెలంగాణ పోలీసులకు నెంబర్‌వన్ స్థానం గుర్తింపు ఉందని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు.
- పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్
కోల్‌సిటీ, డిసెంబరు 29: దేశంలోనే తెలంగాణ పోలీసులకు నెంబర్‌వన్ స్థానం గుర్తింపు ఉందని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. మంగళవారం రామగుండం కమిషనరేట్ పరిధిలో నిర్మాణంలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, పోలీస్ గెస్ట్‌హౌస్ పనులను రామగుండం సీపీ సత్యనారాయణతో కలిసి పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలతో పోలీస్‌స్టేషన్, గెస్ట్‌హౌస్ పనులను త్వరతగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు, హౌసింగ్‌బోర్డు అధికారులకు సూచించారు. ప్రజలకు అత్యా ధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రజలకు సత్వర సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా హంగులతో పోలీస్ స్టేషన్లను, గెస్ట్‌హౌస్‌లను నిర్మిస్తోందని, ఫిర్యాదుదారులకు, ప్రజలకు పోలీసింగ్ వ్యవస్థను అందు బాటులో ఉండడానికి, పోలీసుల మౌలిక సదుపాయాల కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నాడ ని చెప్పారు. నిర్మాణ పనుల ఆలస్యంపై కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. భవనాల్లో ఫర్నీచర్, ఇతర సౌకర్యాల కల్పనపై కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి నెలలో ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్టు చైర్మన్ దామోదర్ చెప్పారు. చైర్మ న్ వెంట పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీలు రవీందర్, ఉద య్‌కుమార్‌రెడ్డి, ఓఎస్‌డీ(ఆపరేషన్) శరత్‌చంద్రపవర్, అడి షనల్ డీసీపీ(ఏఆర్) సంజీవ్, గోదావరిఖని ఏసీపీ ఉమేం దర్, ఏఆర్ ఏసీపీ సుందర్‌రావు, వన్‌టౌన్ సీఐ పర్స రమే ష్, ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్, ఆర్‌ఐ శ్రీధర్, ఎస్‌ఐలు, హౌసిం గ్ బోర్డు ఈఈ శ్రీనివాసరావు ఉన్నారు.
Updated Date - 2020-12-30T04:24:32+05:30 IST