ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లె ప్రకృతి వనాలను వేగవంతంగా పూర్తిచేయాలి

ABN, First Publish Date - 2020-10-29T06:49:39+05:30

ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌, నరసింహారెడ్డితో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌, నరసింహారెడ్డితో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, సెక్రియేషన్‌ షెడ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో సెక్రియేషన్‌ షెడ్లు నవంబర్‌ పదిలోపు పూర్తి చేయాలని అన్నారు. పూర్తిచేసిన సెక్రియేషన్‌ షెడ్లను వినియోగించుకునేలా చూడాలని అన్నారు. పల్లె ప్రకృతి వనంలో పిల్లలు ఆడుకునేందుకు జారుడు బల్లలు, ఊయలలు, సిమెంట్‌ బెంచీలు వారంలోపు ఏర్పాటు చేయాలని అన్నారు.


వరి కోతలు పూర్తయినందున రైతు కల్లాల నిర్మాణాలను చేపట్టడానికి ఇది అనుకూలమైన సమయమని అన్నారు. 50శాతం కల్లాలను నవంబర్‌ 10లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రగతిలో ఉన్న వైకుంఠ ధామాలను పని పూర్తయిన వెంటనే ఎంబీ రికార్డు చేసి చెల్లింపులను పూర్తి చేయాలని తెలిపారు. ఈ నిర్మాణాలను నవంబర్‌ 10లోపు తప్పకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, మండలాల నుంచి ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఈసీలు, టీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-29T06:49:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising