ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజూరాబాద్‌లో కలెక్టర్‌, సీపీ పర్యటన

ABN, First Publish Date - 2020-04-08T10:13:57+05:30

హుజూరాబాద్‌లోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి పర్యటించారు. పట్టణానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్‌, ఏప్రిల్‌ 7: హుజూరాబాద్‌లోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి పర్యటించారు. పట్టణానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారి ఇళ్ల పరిసరాలను కలెక్టర్‌, సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పాజిటివ్‌ వచ్చిన వారు నివసించే కాలనీల్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. బారికేడ్ల లోపల ఉన్న వారికి నిత్యావసర వస్తువులు అందించాలని తహసీల్దార్‌కు సూచించారు. ఈ కాలనీల నుంచి రాకపోకలు లేకుండా చూసుకోవాలని పోలీసులకు తెలిపారు. అనంతరం హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో ఐసొలేషన్‌ వార్డులను పరిశీలించారు. వీరి వెంట ఆర్డీవో బెన్‌షాలేమ్‌, ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు, టౌన్‌ సీఐ మాధవి, తహసీల్దార్‌ బావ్‌సింగ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక ఉన్నారు.


నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ కమలాసన్‌రెడ్డి అన్నారు. కరోనా పాజిటివ్‌ సోకిన ప్రాంతాల్లో ఉన్న వారు బయటకు రావద్దన్నారు.నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. అవసరం లేకున్నా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్‌ చేస్తామన్నారు.

Updated Date - 2020-04-08T10:13:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising