సీఎంఆర్ డెలివరీని త్వరగా పూర్తి చేయాలి
ABN, First Publish Date - 2020-12-15T05:38:21+05:30
యాసంగి పంటకు సంబంధించిన రైస్ డెలివరిని ఈ నెలాఖరుకల్లా పూర్తి చేసేందుకు చర్యలు తీసు కోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశిం చారు.
అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
పెద్దపల్లి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): యాసంగి పంటకు సంబంధించిన రైస్ డెలివరిని ఈ నెలాఖరుకల్లా పూర్తి చేసేందుకు చర్యలు తీసు కోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశిం చారు. సోమవారం తన చాంబర్‌లో సంబంధిత అ ధికారులతో సమావేశం నిర్వహించారు. రైస్ మిల్ల ర్లకు సీఎంఆర్ కింద ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మర ఆడించి లక్ష్యాలకు అనుగుణంగా రైస్ డెలివరి చేయాలన్నారు. యంత్రాల వల్ల ఏమైనా సమస్య లు ఉత్పన్నం అయితే వాటిని వెంటనే మరమ్మతు చేయించుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో నూ ఈ నెలాఖరు వరకు పెండింగులో ఉన్న సీఎం ఆర్‌ను పూర్తి చేసే విధంగా ప్రతి రైస్ మిల్‌ను కా ర్యాచరణ నివేదికను అందజేయాలన్నారు. 24 గం టల పాటు మిల్లులు నడవాలన్నారు. ఈ సమావే శంలో డీఎస్‌ఓ వెంకటేశ్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా ఎరువులను విక్రయించాలి..
జిల్లాలో ఈ యాసంగి సీజన్‌కు గాను రైతులు వినియోగించే ఎరువులను వ్యాపారులు పారదర్శ కంగా విక్రయించాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ఎరువుల అమ్మకాలకు సంబంధించి తప్పనిసరిగా ఈ పాస్ యంత్రాలను వినియోగించాలని ఆదేశించారు. ఈ పాసు యంత్రాలను వినియోగించకుండా ఎరువులను విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎరువుల అమ్మకాలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చర్యలు తీసుకోవాలని అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఏవో తిరుమల ప్రసాద్, డీసీవో నర్సయ్య, ఎరువుల డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-15T05:38:21+05:30 IST