కొత్తగా 114 మందికి కరోనా
ABN, First Publish Date - 2020-10-03T10:23:32+05:30
జిల్లాలో కొత్తగా మరో 114 మంది కరోనా వ్యాధిబారినపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన ..
కరీంనగర్, అక్టోబర్ 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కొత్తగా మరో 114 మంది కరోనా వ్యాధిబారినపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు శుక్రవారం జిల్లాల్లో దాదాపు 230 మందికి వ్యాధి సోకినట్లు తెలిసింది. హుజురాబాద్ డివిజన్ పరిధిలోని జమ్మికుంట మండలంలో 17 మందికి, హుజురాబాద్ మండ లంలో 20 మందికి, వీణవంక మండలంలో ముగ్గురికి , సైదాపూర్ మండలంలో ఎనిమిది మందికి, శంకరపట్నం మండలంలో ముగ్గురికి, ఇల్లందకుంట మండ లంలో ఎనిమిది మందికి వ్యాధి నిర్ధారణ అయింది. అలాగే కరీంనగర్ డివిజన్ పరిధిలోని తిమ్మాపూర్ మండలంలో ఆరుగురికి, మానకొండూర్ మండలంలో ఎనిమిది మందికి, గంగాధర మండలంలో ముగ్గురికి , చొప్పదండి మండలంలో నలుగురికి, రామడుగు మండలంలో 10 మందికి, చిగురుమామిడి మండలంలో ఆరుగురికి, కరీంనగర్ రూరల్ మండలంలో నలుగురికి, కొత్తపల్లి మండలంలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది.
కరీంనగర్ పట్టణంలోని సుభాష్‌నగర్‌లో ఐదు గురు, వావిలాలపల్లిలో ముగ్గురు, విద్యానగర్‌లో నలుగురు, భాగ్యనగర్‌లో ఒకరు, మంకమ్మతోటలో ఒకరు, లక్ష్మీనగర్‌లో ఒకరు, కాపువాడలో ఇద్దరు, హౌసింగ్‌బోర్డులో ఇద్దరు, పద్మశాలివీధిలో ఇద్దరు, మారుతీనగర్‌లో ఇద్దరు వ్యాధిబా రిన పడ్డారు. విద్యారణ్యపురిలో ఒకరు, చంద్రపురికాలనీలో ఒకరు, గణేశ్ నగర్‌లో ఒకరు, కట్టరాంపూర్‌లో ముగ్గురు, భగత్‌నగర్‌లో ఇద్దరు, రేకుర్తిలో ఒక్కరు, సీతారాంపూర్‌లో ఇద్దరికి వ్యాధి సోకింది. చాలా మంది ప్రైవేట్ హాస్పి టల్స్ లో సీటీస్కాన్ పరీక్షలు నిర్వహించుకొని పాజిటివ్ వచ్చిన వారు హాస్పి టల్స్, ఇళ్లలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
Updated Date - 2020-10-03T10:23:32+05:30 IST