ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేటర్‌లో గెలుపుపై జగిత్యాల జిల్లాలో బీజేపీ సంబరాలు

ABN, First Publish Date - 2020-12-06T05:21:56+05:30

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంపై శనివారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు.

జగిత్యాలలో విజయోత్సవ ర్యాలీలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 5: గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంపై శనివారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రేటర్‌  హైదరాబాద్‌ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించిందని, ఇది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, పాలనాతీరుకు చెంపపెట్టు అని అన్నారు. 2023లో బీజేపీ అధికారంలోకి రావడం తధ్యమని అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు  రాగిల్ల సత్యనారాయణ, కృష్ణహరి,  దశరథరెడ్డి,  ఎండబెట్ల వరుణ్‌కుమార్‌, నలువాల తిరుపతి, కొక్కు గంగాధర్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T05:21:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising