ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌కు దమ్ము ధైర్యం లేదు: బండి సంజయ్

ABN, First Publish Date - 2020-10-27T13:26:10+05:30

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ దీక్షను కొనసాగిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తన కార్యాలయంలో దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ సీపీ జోయల్ డేవిస్ టీఆర్ఎస్ కార్యకర్త అని అన్నారు. సీపీ భార్యను, పిల్లలను తనిఖీ చేస్తే తెలిసేదని... సీఎం కేసీఆర్ భార్యను, పిల్లలను తనిఖీ చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు దమ్ము ధైర్యం లేదని విమర్శించారు. ఓటమి భయంతో పిచ్చి పనులు చేస్తున్నారన్నారు. నిరాహార దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దుబ్బాకకు వస్తున్న డబ్బులు కేసీఆర్ ఫామ్ హౌస్ వే అని..కేసీఆర్ ఫామ్ హౌస్‌ను తనిఖీ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.



దుబ్బాక బీజేపీ అభ్యర్థి  రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలు, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అక్కడకు బయలుదేరిన సంజయ్‌ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి  కరీంనగర్‌కు తరలించారు. దీంతో కరీంనగర్‌లో తన కార్యాలయంలో గత రాత్రి  ఒంటరిగానే సంజయ్ దీక్షకు దిగారు. ఎంపీ కార్యాలయానికి బీజేపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. రాత్రి నుంచి కేసీఆర్, హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 

Updated Date - 2020-10-27T13:26:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising