ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూల జాతరకు వేళాయే...నేటి నుంచి బతుకమ్మ సంబరాలు

ABN, First Publish Date - 2020-10-16T06:00:05+05:30

తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు సంబరంగా జరుపుకునే బతు కమ్మకు వేళయింది. కరోనా నేపఽథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూనే బతుకమ్మ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్టోబరు 24 పెద్ద బతుకమ్మ

కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే వేడుకలకు సిద్ధమైన మహిళలు 

పూల తోటగా మారనున్న జిల్లా 


(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు సంబరంగా జరుపుకునే బతు కమ్మకు వేళయింది. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూనే బతుకమ్మ సంబరాలను జరుపుకోవడానికి మహిళలు సిద్ధమయ్యారు. తెలంగాణలోనే అతిపెద్ద పండుగగా ఖ్యాతిపొందిన బతుకమ్మకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పకృతి ఆరాధనకు బతుకమ్మ వేడుకగా నిలుస్తుంది. దేశంలో తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ రాష్ట్ర సాధనలోనూ ఉద్యమ స్ఫూర్తిని నింపింది. కొవిడ్‌ తగ్గుముఖం పడుతున్న క్రమంలోనే బతుకు నిచ్చే బతుకమ్మను కొలుస్తూ రోజుకో నైవేధ్యంతో సాగనంపడానికి మహిళలు సిద్ధవ- రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్త శుద్ది లేదుుయ్యారు. ఈ సారి సమృద్ధిగా వర్షాలు కురవడంతో వాగులు, ఒర్రెలు పొంగి పొర్లుతుండగా చెరువులు జలకళతో ఉట్టిపడుతుండడంతో బతుకమ్మను సాగనంపడానికి నీళ్ల కొరత లేకపోవడంతో మహిళలు సంబురంగా ఉన్నారు. 


సాంప్రదాయాల్లో పెద్దతనంగా బతుకమ్మ... 

 తెలంగాణ సాంప్రదాయాల్లో పెద్దతనం పోషిస్తుంది. బతుకమ్మ సంబరాలు జిల్లాలో ప్రతిపల్లె ఆట పాటతో పులకరించిపోనుంది. బతుకమ్మ అనగానే మహిళల ఆటాపాటా గుర్తుకు వస్తుంది. బతుకమ్మ అంటే మహిళలే కాదు ప్రకృతి కూడా పుకలరిస్తుంది. ఆడపడుచులు పుట్టింటికి వచ్చి సందడి చేసే బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతికి ప్రతీకగా... నిలుస్తోంది.   తెలంగాణ పల్లె, పట్టణ వాకిళ్లు పూల తోటగా మారి పోయే వేళ... తంగేడు పువ్వు ముచ్చట్లు... గునుగు పువ్వు సంబరాల మధ్య ఆడపడుచులు పుట్టింటికి తరలివస్తున్న ఆనందోత్సవం...... ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు గౌరమ్మ ఉయ్యాలో... పాడిపంటలను ఉయ్యాలో... చల్లంగా చూడమ్మ ఉయ్యాలో... అంటూ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ వేడుకలకు ఈ సారి కొవిడ్‌ అడ్డుగా మారినా సంబురాలకు మాత్రం జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.


శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా మహిళల శ్రమజీవన సంస్కృతికి అద్దం పడుతూ మహాలయ అమవాస్య నుంచి చిన్న బతుకమ్మలతో సంబరాలు మొదలై పెద్ద బతుకమ్మతో ముగుస్తాయి. సద్దుల (పెద్ద) బతుకమ్మ అక్టోబరు 24న అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. ఈ సారి కూడా ప్రభుత్వం బతుకమ్మ సారెను కూడా జిల్లా వ్యాప్తంగా అందించింది. 2,10,625 మంది అర్హులకు చీరలను మహిళలకు పంపిణీ చేస్తున్నారు. 

Updated Date - 2020-10-16T06:00:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising