ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోం కంపోస్టు తయారీకి విశేష స్పందన

ABN, First Publish Date - 2020-12-12T05:07:16+05:30

హోం కంపోస్టింగ్‌ తయారీకి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని నగరపాలక సంస్థ కమిషనర్‌ వల్లూరు క్రాంతి తెలిపారు.

ప్రజలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన కల్పిస్తున్న కమిషనర్‌ వల్లూరు క్రాంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగరపాలక కమిషనర్‌ వల్లూరు క్రాంతి

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హోం కంపోస్టింగ్‌ తయారీకి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని నగరపాలక సంస్థ కమిషనర్‌ వల్లూరు క్రాంతి తెలిపారు. స్వచ్ఛసర్వేక్షణ్‌ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం 5వరోజు 45, 12వ డివిజన్లలో పర్యటించారు. స్థానిక కార్పొరేటర్లు పిట్టల వినోద, తోటరాములతో కలిసి డివిజన్లలో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. 45,12డివిజన్లలో పలువురి గృహాల్లో కంపోస్టు పిట్స్‌ ఏర్పాటుచేయించారు. 12వ డివిజన్‌లో కార్పొరేటర్‌ తోటరాములు ఆధ్వర్యంలో ప్రముఖులు, వార్డు కమిటీ సభ్యులు, మహిళా సంఘాలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లా డుతూ తడి చెత్తను వేరుచేసి హోం కంపోస్టింగ్‌ తయారీ కోసం పిట్స్‌ ఏర్పాటు చేసి ముందుకు వచ్చిన డివిజన్‌ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. తడిచెత్తతో ఎరువు తయారు చేసి ఇంట్లో మొక్కలకు ఎరువుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని పూర్తి తగ్గించాలని కోరారు. ఇంటితోపాటు పరిసరాలను, కాలనీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2021లో ప్రతిఒక్కరూ భాగస్వాములై మంచి ర్యాంకింగ్‌ కోసం సహకరించాలని తెలిపారు. కార్యక్రమాల్లో సూపర్‌వైజింగ్‌, వార్డులెవల్‌ ఆఫీసర్లు, మెప్మా సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T05:07:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising