ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ-చలాన్లపై ట్రాఫిక్‌ పోలీసుల అవగాహన

ABN, First Publish Date - 2020-11-27T04:31:42+05:30

వాహనాల మీద మూడు కంటే ఎక్కు వ చలాన్లు ఉంటే ఆ వాహనాలను సీజ్‌ చేస్తామని రామగుండం ట్రాఫిక్‌ సీఐ రమేష్‌బాబు పేర్కొన్నారు.

అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌సిటీ, నవంబరు 26: వాహనాల మీద మూడు కంటే ఎక్కు వ చలాన్లు ఉంటే ఆ వాహనాలను సీజ్‌ చేస్తామని రామగుండం ట్రాఫిక్‌ సీఐ రమేష్‌బాబు పేర్కొన్నారు. ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వ ర్యంలో బుధవారం పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఈ చలాన్లపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌లో ఈ చలాన్‌ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు సీసీ కెమెరాల ద్వారా చలాన్లు పడతాయని, ఎప్పటికప్పుడు పబ్లిక్‌ వ్యూలో చలాన్ల గురించి తెలుసుకోవాలన్నారు. ఈ చలాన్లను ఏడు రోజుల్లోపు చెల్లించాలన్నారు. మీ సేవా, ఈ సేవా, పేటీఎం, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించవచ్చునన్నారు. వాహనాలు అమ్మినప్పుడు వెంటనే కొన్నవారి పేరుపై రిజిస్ర్టేషన్‌ చేయాలని, లేని యెడల ఈ చలాన్లు పాత యజమానికి వస్తాయని, ప్రమాదాలు జరిగినప్పుడు కూడా యజమాని ఏ2గా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ నాగరాజు, ఏఎస్‌ఐ స్వామి, హెడ్‌కానిస్టేబుల్‌ బాయ్‌ శ్రీను పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T04:31:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising