ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 152 మందికి పాజిటివ్‌

ABN, First Publish Date - 2020-09-03T08:43:06+05:30

జిల్లావ్యాప్తంగా 152 మందికి కరోనా వ్యాధి నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 2వ తేదీన కూడా అదే స్థాయిలో కేసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరు మృతి

తగ్గని కరోనా ఉధృతి

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 2 (ఆంధ్రజ్యోతిప్రతినిధి):  జిల్లావ్యాప్తంగా 152 మందికి కరోనా వ్యాధి నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 2వ తేదీన కూడా అదే స్థాయిలో కేసులు నమోదైనట్లు తెలుస్తున్నది.


కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని దుర్శేడ్‌ గ్రామంలో 50 సంవత్సరాల వ్యక్తి కోవిడ్‌బారినపడి బుధవారం స్థానిక ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆయన కుటుంబంలో మొత్తం ఏడుగురికి కొవిడ్‌ బారిన పడ్డట్లు సమాచారం. రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో 55 సంవత్సరాల  వ్యక్తి కరోనా వ్యాధితో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి బుధవారం మరణించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు జిల్లాలో ఈనెల 2వ తేదీన కూడా భారీ సంఖ్యలోనే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిసింది. 


 భారీగా నమోదవుతున్న కేసులు

కరీంనగర్‌ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో 73 మంది వైరస్‌ బారిన పడ్డట్లు నిర్ధారణ కాగా మరికొంత మంది సీటీస్కాన్‌లో వ్యాధి నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. హుజూరాబాద్‌లో 61 మంది,  జమ్మికుంటలో 45, మానకొండూర్‌లో 13,  కొత్తపల్లిలో 13, కరీంనగర్‌ రూరల్‌లో ఇద్దరికి, తిమ్మాపూర్‌లో ఎనిమిది, గన్నేరువరంలో ఇద్దరికి వ్యాధి నిర్ధారణ అయింది.  వీణవంక మండలంలో 18, చొప్పదండిలో 26, శంకరపట్నంలో ఏడు, రామడుగులో 21, గంగాధరలో 13, సైదాపూర్‌లో 8, చిగురుమామిడిలో 8, ఇల్లందకుంటలో ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-09-03T08:43:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising