ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుపేదలకు ‘కల్యాణలక్ష్మి’ వరం

ABN, First Publish Date - 2020-09-23T06:05:29+05:30

కల్యాణలక్ష్మి పథకం నిరుపేదల పాలిట వరంగా మారిందని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే రాజయ్య


చిలుపూర్‌, సెప్టెంబరు 22 : కల్యాణలక్ష్మి పథకం నిరుపేదల పాలిట వరంగా మారిందని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో తహసీల్దార్‌ రవిచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా 124 మంది లబ్దిదారులకు మంజూరైన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.


అనంతరం నష్కల్‌, రాజవరంలో ఇటీవల అనారోగ్యం కారణంగా మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. చిలుపూర్‌ బర్రెంకల చెరువు కట్టపై నిర్మిస్తున్న మినీ ట్యాంక్‌బండ్‌ను పరిశీలించి సర్పంచ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత బాలరాజు, స్టేషన్‌ఘన్‌పూర్‌ జడ్పీటీసీ మారపాక రవి, సర్పంచ్‌ ఉద్దెమారి రాజ్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ సరిత, సర్పంచులు ఆరూరి ప్రణీత, అందజీదేవి, రవీందర్‌, రంగు రమేష్‌, వలెందర్‌ రెడ్డి, ఎంపీడీవో వేణుగోపాల్‌ రెడ్డి, నాయబ్‌ తహసీల్దార్‌ సూర్యానాయక్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-09-23T06:05:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising