ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేవంత్ రెడ్డి కాలికి గాయం

ABN, First Publish Date - 2020-10-17T21:18:32+05:30

మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాలికి గాయమైంది. నాగర్ కర్నూలు జిల్లా ఎల్లూరు వద్ద నీట మునిగిన కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు పంప్ హౌజ్ పరిశీలనకు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్వకుర్తి: మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాలికి గాయమైంది. నాగర్ కర్నూలు జిల్లా ఎల్లూరు వద్ద నీట మునిగిన కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు పంప్ హౌజ్ పరిశీలనకు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది. సీనియర్ నేతలు మల్లు రవి, సంపత్ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన బయల్దేరి వెళ్లారు. అయితే మార్గమధ్యంలోనే తెలకపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పునుంతల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా బైఠాయించారు. కాంగ్రెస్‌ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో రేవంత్‌ కాలికి గాయం అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరంకుశత్వం నడుస్తోందని విమర్శించారు. ప్రమాదం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందని, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే.. ప్రభుత్వం తమని అనుమతించడం లేదని ఆరోపించారు. 

Updated Date - 2020-10-17T21:18:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising