ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళేశ్వరంలో శని త్రయోదశి పూజలు

ABN, First Publish Date - 2020-12-13T04:54:16+05:30

కాళేశ్వరంలో శని త్రయోదశి పూజలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహదేవపూర్‌, డిసెంబరు 12: మండలంలోని కాళేశ్వర ముక్తీ శ్వర స్వామి ఆలయంలో శనివారం శని త్రయోదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. కాళేశ్వర ఆలయంలో శని పూజలు నిర్వహిస్తే విద్య, వైద్య, వైవాహిక, వ్యాపా రాది విషయాల్లో శుభం కలుగుతుందని నమ్మకం. త్రయోదశితో కూడిన శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శని పూజలు నిర్వహించుకున్నారు. త్రివేణి సంగమ గోదావరిలో స్నానాలు ఆచరించిన అనం త రం స్వావివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసంలోని ఆఖరి శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో ఆలయంలో పూజలు నిర్వహించారు. శనివారం 200 అభిషేకాలు, 150 కాల సర్పదోష నివారణ పూజలు, 150 కుంకుమార్చనలు, 548 శనిపూజా టికె ట్లు విక్రయించినట్టు అధికారులు వెల్లడించారు. ఆలయానికి రూ. 4.05 లక్షల ఆదా యం సమకూరిందని తెలిపారు. 


స్వామివారిని దర్శించుకున్న ఆర్టీఐ కమిషనర్‌

కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఆర్టీఐ కమిషనర్‌ శంకర్‌ నాయక్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు  అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం కమిషనర్‌ను అర్చకులు సన్మానించారు. ఆయన వెంట ఎస్సై నరహరి తదితరులున్నారు. 


వెండి చెంబుల బహూకరణ

కాళేశ్వరంలోని శుభానందా దేవి అమ్మవారి ఆలయానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ రమణారెడ్డి దంపతులు రూ. 30వేల విలువైన నాలుగు వెండి చెంబులను బహూకరించారు అర్చకు లు ఎస్‌ఈ దంపతులను సన్మానించారు.

Updated Date - 2020-12-13T04:54:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising