ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీవీ మెమోరియల్ ఏర్పాటుకు నిర్ణయం: కేకే

ABN, First Publish Date - 2020-07-07T00:26:59+05:30

పీవీ జ్ఞానభూమిలో పీవీ మెమోరియల్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పీవీ శత జయంతి కమిటీ చైర్మన్ కే కేశవరావు వెల్లడించారు. పీవీ మెమోరియల్ ఏర్పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పీవీ జ్ఞానభూమిలో పీవీ మెమోరియల్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పీవీ శత జయంతి కమిటీ చైర్మన్ కే కేశవరావు వెల్లడించారు. పీవీ మెమోరియల్ ఏర్పాటు చేయడానికి అన్ని పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆర్కిటెక్ వారు కొన్ని డిజైన్లను చూపించారని కేకే తెలిపారు. వాటిని కమిటీ పరిశీలించిందన్నారు. మరో వారం రోజుల్లో కమిటీ మళ్లీ సమావేశం జరుగుతుందని చెప్పారు. పీవీ శత జయంతి కమిటీ చైర్మన్ కే కేశవరావు అధ్యక్షతన ఆయన నివాసంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, రమణ చారి, ఇతర అధికారులు హాజరయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ నెల చివరలో పీవీ మెమోరియల్ డిజైన్ ఫైనల్ అవుతుందన్నారు. పీవీ శత జయంతి సందర్భంగా సెమినార్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ సెమినార్‌కు పీవీతో పరిచయం ఉన్న ఇతర దేశాల ప్రతినిధులను సైతం పిలవాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అమెరికా, మలేషియాకు చెందిన ప్రతినిధులను పిలవాలని అనుకుంటున్నట్లు కేకే చెప్పారు.

Updated Date - 2020-07-07T00:26:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising